Saturday, May 18, 2024
- Advertisement -

ర‌చ‌యిత‌ను ద‌త్త‌త తీసుకున్న‌దెవ‌రు?

- Advertisement -

చిన్న సినిమాల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తూ ఇటీవ‌ల విజ‌యవాడ‌, విశాఖ‌ప‌ట్ట‌ణంలో హ‌ఠాత్తుగా న‌టుడు జ‌గ‌ప‌తి బాబు ప్ర‌ద‌ర్శ‌న‌లు చేశాడు. ఎందుకో చేశాడో ఎవ‌రికీ అర్థం కాలేదు. రాజ‌కీయాల్లో ప్ర‌వేశాల కోస‌మా? లేదా న‌ంది అవార్డుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూనా? అని ఎవ‌రికీ తెలియ లేదు. చివ‌రికి ఆయ‌న మాట్లాడుతూ చిన్న సినిమాల‌కు మ‌ద్ద‌తు కోసం ప్ర‌ద‌ర్శ‌న‌లు చేశాన‌ని జ‌గ్గుభాయ్ ప్ర‌క‌టించారు. కానీ ఎవ‌రూ న‌మ్మ‌లేదు. కానీ అది నిజ‌మేన‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల ప్రారంభ‌మైన సినిమా ర‌చ‌యిత. ఈ సినిమాకు మంచి ప్ర‌చారం క‌ల్పించి థియేట‌ర్లు ల‌భించేలా చేయాల‌ని జ‌గ‌ప‌తి బాబు ఉన్నారు.

అత‌డు ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. జ‌వాన్ సినిమాలో సాయిధ‌ర‌మ్ తేజ్‌కు నాన్న‌గా న‌టిస్తున్నాడు. ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నంది అవార్డుల్లో ఒక‌టి అందుకోనున్నాడు. ఈ విధంగా న‌టిస్తున్న ఆయ‌న చిన్న సినిమా క‌ష్టాలను తెలుసుకున్నాడు. ఆ సినిమాకు థియేట‌ర్లు దొర‌క‌కపోవ‌డం.. సినిమా బాగున్నా ఆడే ప‌రిస్థితి క‌నిపించ‌క‌పోవ‌డంతో అత‌డు స్పందించాడు. మంచి మంచి చిన్న సినిమాలు వెనుకబడిపోతున్నాయని ఆందోళ‌న వ్య‌క్తం చేసిన ఆయ‌న చిన్న‌ సినిమాల‌కు ప్రోత్సాహం క‌ల్పిద్దామ‌ని నిర్ణ‌యించుకున్నాడు. అందులో భాగంగా ర‌చ‌యిత సినిమాకు మ‌ద్దతు ప‌లికారు. ఒక విధంగా ద‌త్త‌త తీసుకున్న మాదిరే.

https://www.youtube.com/watch?v=tn66yOluSk8

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -