Wednesday, April 24, 2024
- Advertisement -

ఆనందయ్యకు నటుడు జగపతిబాబు మద్దతు..

- Advertisement -

నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశంలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. ఆనందయ్య ఇచ్చిన నాటు మందు ద్వారా కరోనా బారి నుంచి ఇప్పటికే చాలామంది కోలుకున్నారు. దాంతో ఈయన పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. అయితే ఇప్పుడు ఇదే ఆయనకు పెద్ద ముప్పుగా మారిందని కొంత మంది అంటున్నారు. ఆనందయ్య ఇస్తున్న ఈ నాటు మందును ఆయుర్వేదం మందుగా పరిగణించాలా లేదా అనే విషయంలో ప్రభుత్వ, వైద్య అధికారులు ఎటూ తేల్చుకోలేక కొట్టుమిట్టాడుతున్నారు.

మరోవైపు మెడికల్ మాఫియా ఆనందయ్యకు ఏమైనా కీడు కల్పిస్తారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. ఆయనకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి వినతులు కూడా వెళ్తున్నాయి. కాగా, టాలీవుడ్ నటులు జగపతి బాబు ఆనందయ్యకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ‘ఆనందయ్యను చూస్తుంటే తల్లి ప్రకృతి మనల్ని రక్షించడానికి ఆయన రూపంలో వచ్చిందనిపిస్తోంది.

ఆనందయ్యగారి వైద్యానికి అధికారిక అనుమతి రావాలని ప్రార్థిస్తున్నాను. అదే ఈ ప్రపంచాన్ని కాపాడాలి. ఆ రకంగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాలి’.. అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే జగపతిబాబు వ్యాఖ్యలను పలువురు సమర్థిస్తుంటే, కొందరు మాత్రం ఇలాంటి వాటిని మీలాంటి వారు సమర్థించడం తగదంటూ హితవు పలుకుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -