Thursday, March 28, 2024
- Advertisement -

సూప‌ర్ స్టార్ హీరోకు విల‌న్‌గా సీనియ‌ర్ హీరో

- Advertisement -

సంక్రాంతి బ‌రిలోకి తెలుగు హీరోల‌తో పాటు వ‌చ్చి హిట్టు అందుకున్న త‌మిళ హీరో సూర్య‌. ‘గ్యాంగ్’ సినిమాతో విజయం అందుకున్నసూర్య ప్రస్తుతం మ‌రో సినిమాతో బిజీగా ఉన్నాడు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో విల‌న్‌గా రౌద్రం ప‌లికించే న‌టుడు కోసం వెతుకుతున్నార‌ట‌. ఈ పాత్ర‌కు లెజెండ్‌ సినిమాతో విలన్‌గా మారిన సీనియర్‌ హీరో జగపతిబాబు ప‌ర్ఫెక్ట్ అని నిర్ణ‌యించార‌ని స‌మాచారం. జ‌గ‌ప‌తిబాబు తెలుగుతోపాటు మాలీవుడ్‌, కోలీవుడ్‌లలోనూ విల‌న్‌గా న‌టించారు. తమిళంలో విజయ్‌ హీరోగా ‘భైరవ’, రజనీకాంత్‌ ‘లింగా’ సినిమాలలో విలన్‌గా జగ్గుభాయ్ న‌టించాడు. ఇప్పుడు మరో తమిళ హీరో సూర్య త‌ర్వాతి సినిమాలో విల‌న్‌ పాత్రలో క‌నిపించ‌నున్నాడు.

రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కుస్తున్నారు. ఈ సినిమాలో సాయి ప‌ల్ల‌వి, ర‌కుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. విలన్‌ పాత్ర కోసం జగపతిబాబును సంప్రదించగా పాత్ర నచ్చడంతో ఓకే చెప్పేశార‌ని టాక్‌. ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్‌ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి రెండో వారంలో రెండో షెడ్యూల్‌ ప్రారంభం కానుంది.

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -