- Advertisement -

‘జన నాయగన్’.. లీక్ వివాదం!

- Advertisement -

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ సినిమా ఆన్‌లైన్‌లో లీక్ కావడం సినీ ఇండస్ట్రీలో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో సినిమా నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్‌ కఠిన హెచ్చరిక జారీ చేసింది.

ఏప్రిల్ 10, 2026న ఈ సినిమా ఆన్‌లైన్‌లో లీక్ అయినట్లు సమాచారం. ఇంకా సెన్సార్ సర్టిఫికేట్ కూడా రాని సమయంలో ఈ లీక్ జరగడం గమనార్హం. ముఖ్యంగా టైటిల్ క్రెడిట్స్, ప్రారంభ సన్నివేశాలు, క్లైమాక్స్ భాగాలు సోషల్ మీడియాలో వైరల్ అయినట్లు తెలుస్తోంది.

‘జన నాయగన్’ చిత్రానికి సంబంధించిన సన్నివేశాలు అక్రమంగా యాక్సెస్ చేసి, కాపీ చేసి, సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఇది కాపీరైట్ చట్టాల ఉల్లంఘన, తీవ్రమైన నేరం అని నిర్మాతలు తెలిపారు. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా ఈ కంటెంట్‌ను షేర్ చేయడం కూడా నేరమేనని స్పష్టం చేశారు.

లీక్‌లో భాగస్వామ్యులైన వారిని గుర్తించేందుకు ఇప్పటికే ఫోరెన్సిక్ దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.ప్రతి డిజిటల్ యాక్షన్ ట్రేస్ చేయవచ్చు. ఇందులో పాల్గొన్న వారిపై సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం అని హెచ్చరించారు. అలాగే, ఎవరికైనా ఈ లీక్ కంటెంట్ వస్తే వెంటనే డిలీట్ చేయాలని సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -