Wednesday, May 8, 2024
- Advertisement -

జనతా గ్యారేజ్ కి అడ్డం గా ఉన్నది ఎవరు ?

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రతిష్టాత్మక 25 వ సినిమా మార్క్ ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఇప్పుడు 26 వ సినిమాను దింపేపనిలో బిజీగా ఉన్నాడు. మిర్చి-శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్స్ తరువాత కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న జనతాగ్యారేజ్ తో ఎన్టీఆర్ కి నికార్సయిన హిట్ ఇచ్చి కెరీర్ ని పీక్స్ లో సెట్ చేయాలని కొరటాల శివ చాలా కష్టపడుతున్నాడు.

మరో 6 రోజుల్లో సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కాబోతుంది, సినిమాను ఆగస్టు 12 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమాకు తెలుగులో ఎలాంటి పోటిలేకుండా సోలో రిలీజ్ దక్కుతు౦డట౦తో రెండు వారాలు కుమ్మేసుకోవడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఓ సినిమా పోటిగా వస్తుంది.

కానీ అది తెలుగు సినిమా కాదు బాలీవుడ్ లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలతో పోల్చితే బిగ్గెస్ట్ మాగ్నం ఓపస్ గా చెప్పుకుంటున్న మొహెంజోదారో సినిమా కూడా ఆగస్టు 12 న రిలీజ్ కాబోతుంది. హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ సినిమా ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -