- Advertisement -

చరణ్‌తో అలా చేస్తే వెయిట్ లాస్..జాన్వీ క్రేజీ కామెంట్స్!

- Advertisement -

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ చిత్ర ప్రమోషన్లు దేశవ్యాప్తంగా జోరందుకున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 4న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ బెంగళూరులో భారీ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ వేదికపై జాన్వీ కపూర్ రామ్ చరణ్‌తో కలిసి పనిచేయడంపై తన సంతోషాన్ని పంచుకుంటూనే.. బరువు తగ్గడం (Weight Loss) గురించి చేసిన ఒక ఫన్నీ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ప్రెస్ మీట్‌లో ఒకరు ఫిట్‌నెస్ గురించి అడగ్గా.. “నా దగ్గర ఒక అద్భుతమైన వెయిట్ లాస్ టిప్ ఉంది.. మీరంతా రామ్ చరణ్ సార్‌తో కలిసి ఒక పాటలో డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించండి.. కేవలం అరరోజులోనే మీరంతా సన్నగా మారిపోతారు.” అంటూ జాన్వీ సరదాగా నవ్వేసింది. రామ్ చరణ్‌తో డ్యాన్స్ స్టెప్పులు వేయడం అంటే అంత ఈజీ కాదని.. ఆయన ఎనర్జీ అందుకోవడం కోసం విపరీతంగా శ్రమించాల్సి వస్తుందని చెప్పింది. తాము చేసిన పాట కోసం కేవలం మూడు నాలుగు రోజులు షూట్ చేశామని.. నాలుగో రోజు వచ్చేసరికి చరణ్ పక్కన ఉన్న డ్యాన్సర్లు అందరూ కూడా బరువు తగ్గి చాలా చిన్నగా కనిపించారంటూ మెగాస్టార్ డ్యాన్స్ పవర్‌ను కొనియాడింది.

మరోవైపు ఇదే ఈవెంట్‌లో రామ్ చరణ్ సైతం జాన్వీ కపూర్ అంకితభావంపై ప్రశంసల జల్లు కురిపించారు. తనకు రిహార్సల్స్ చేయడానికి సమయం లేక సెట్‌లోనే స్టెప్పులు నేర్చుకుని చేశానని.. అయితే జాన్వీ మాత్రం ముంబైలోనే ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా ప్రాక్టీస్ చేసి తనకంటే వంద రెట్లు అద్భుతంగా డ్యాన్స్ చేసిందని చెప్పారు.

1980ల నాటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక సామాన్య విలేజర్ క్రీడల ద్వారా తన ఊరి ఉనికి కోసం.. బలమైన శత్రువుపై ఎలా పోరాడాడనే కాన్సెప్ట్‌తో బుచ్చిబాబు ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -