- Advertisement -

చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు!

- Advertisement -

పార్టీ ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. రీజనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కర్తలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ప్రధానంగా ఈ సమావేశంలో చంద్రబాబు రెండేళ్ల పాలనా వైఫల్యాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, SIR, స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రజా సమస్యలపై నేతలకు వివరించారు జగన్. ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ జెండా ఎగ‌రేయాలి…చంద్ర‌బాబు అధికార దుర్వినియోగానికి పాల్ప‌డినా.. కార్య‌క‌ర్త‌లకు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌లు అండ‌గా నిల‌బ‌డాలి అని కోరారు.

స్థానిక సంస్థ‌ల అభ్య‌ర్థికి అన్ని విధాలుగా తోడుగా ఉండాలి.. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా, ఇబ్బందులకు గురిచేసినా.. వైసీపీ జెండా ఎగరాలన్నారు. ఈ సమావేశంలో చంద్ర‌బాబు వెన్నుపోటుకు రెండేళ్లు బుక్‌లెట్‌ ఆవిష్క‌రించారు. ఇన్ని మోసాలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని అరాచకాలు ప్రజలకు వివరించేందుకు ఈ బుక్‌లెట్‌ను రిలీజ్ చేస్తున్నాం అన్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరుతో మోసం.. అందరికీ ఈ బుక్‌లెట్ అందుబాటులోకి తీసుకువ‌స్తున్నాం అన్నారు జగన్.

18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1,500 చొప్పున ఆడబిడ్డ నిధి ఇస్తాను అన్నావు.. ఎందుకు రెండేళ్లు ఇవ్వలేదు అంటే చంద్రబాబు నుండి మాట రాదు అన్నారు. నిరుద్యోగ భృతి నెలకు రూ.3,00 ఇస్తాను అన్నావు.. ఎందుకు ఇవ్వలేదు? అంటే సమాధానం లేదు అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -