Tuesday, May 21, 2024
- Advertisement -

మార్చి మొదటి వారంలో ‘జతగా…’

- Advertisement -

వరుసగా విజయవంతమైన చిత్రాలు అందించడం అంటే ఆషామాషీ కాదు. పైగా, కేవలం కమర్షియల్ హిట్ చిత్రాలుగా మాత్రమే కాకుండా, ప్రేక్షకుల హృదయాలను కూడా తాకే చిత్రాలుగా పేరు తెచ్చుకోవడం అంటే చిన్న విషయం కాదు. ‘ప్రేమిస్తే’ నుంచి ‘డా.. సలీమ్’ వరకు సురేశ్ కొండేటి అందించిన పదకొండు చిత్రాలూ ఈ కోవకే వస్తాయి.

ఫీల్ గుడ్ కమర్షియల్ ఎంటర్ టైనర్స్ గా ప్రేమిస్తే, షాపింగ్ మాల్, జర్నీ, రేణిగుంట, పిజ్జా, మహేశ్, డా. సలీమ్.. ఇలా సురేశ్ అందించిన అన్ని చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుని ఆయనకు మంచి నిర్మాత అనే పేరు తెచ్చాయి. ఇప్పుడు సురేశ్ కొండేటి పన్నెండో సినిమాగా ‘జతగా’ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రవిశేషాల్లోకి వస్తే..

మలయాళంలో హిట్ పెయిర్ అనిపించుకుని, ‘ఓకే బంగారం’తో తెలుగు, తమిళ ప్రేక్షకులతో కూడా మంచి జోడీ అనిపించుకున్న దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా రూపొందిన మలయాళ చిత్రం ‘ఉస్తాద్ హోటల్’. ఈ చిత్రాన్ని ‘జతగా…’ పేరుతో తెలుగులోకి అనువదించారు సురేశ్ కొండేటి. అన్వర్ రషీద్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -