Tuesday, May 21, 2024
- Advertisement -

రాజమౌళి ముంబై కి జంప్ ?

- Advertisement -

తెలుగు సినిమా ఖ్యాతినే కాకుండా భారత సినిమా ఖ్యాతిని కూడా ప్రపంచ దేశాలకి బాహుబలితో చాటి చెప్పిన రాజమౌళి ఇప్పుడు ముంబై కి షిఫ్ట్ అవ్వబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ముంబై వెళ్ళే విషయం లో రాజమౌళి ఎక్కడా చెప్పలేదు కానీ మీడియా వారు మాత్రం ఆయన ముంబై లో ఒక ఆఫీస్ ని సెట్ చేస్తున్నారు అని చెబుతున్నారు.

ప్రస్తుతం బాహుబలి-2 షూటింగ్ లో బిజీగా ఉన్న జక్కన్న.. ఈ సినిమా తరువాత తన మకాంను ముంబైకి మార్చబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కించబోయే సినిమాలపై బాలీవుడ్ లోనూ ఆసక్తి ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న కరణ్ జోహార్, ఇదే విషయాన్ని రాజమౌళికి కూడా చెప్పినట్టు వినిపస్తోంది. రాజమౌళి ఈ ఐడియా కి ఓకే చెప్పి అక్కడ ఇల్లు ఒద్దనీ ఆఫీస్ కావాలనీ ప్లాన్ చేసుకున్నారట. ముంబై లో ఒక ప్రఖ్యాత ప్రాంతం లో రిచ్ ఏరియా లో ఒక ఫ్లాట్ ని తీసుకుని ఆఫీస్ చేసుకోవాలని మౌళి చూస్తున్నారట. ఏదేమైనా మౌళి బాలీవుడ్ మీద పూర్తి ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -