Saturday, May 11, 2024
- Advertisement -

క్రేజీగా జయలలిత బయోపిక్..ఐశ్వ‌ర్య‌రాయ్‌కి పోటీగా అనుష్కా….?

- Advertisement -

వెండితెరపై అందాల కథానాయికగా .. తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేసిన శక్తిమంతమైన నాయకురాలిగా జయలలిత ప్రజల మనసులను దోచుకున్నారు. అన్నివర్గాల ప్రజలచేత ఆప్యాయంగా ‘అమ్మ’ అనిపించుకున్నారు. అలాంటి జయలలిత జీవితచరిత్రను రూపొందించడానికి దర్శకులు ఎ.ఎల్. విజయ్ .. ప్రియదర్శన్ .. భారతీరాజా ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు వున్నారు.

పురుచ్చి తలైవి, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ రోజు రోజుకు క్రేజీగా మారుతోంది. బయోపిక్ ఇంతవరకు ప్రారంభం కానేలేదు. అప్పుడే దర్శకుల, నిర్మాతల మధ్య ఈ చిత్రం గురించి పోటీ నెలకొని ఉంది. ఇదిలా ఉంటే తాజాగా అత్యంత ఆసక్తికరమైన ప్రకటన జయలలిత బయోపిక్ గురించి వచ్చింది.

జయలలిత పాత్రలో ఐశ్వర్యారాయ్ ని నటింపజేసేందుకు తాజగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు భార‌తీరాజా కాంపౌండ్‌నుంచి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. భారతీరాజా చకచకా తన ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలను మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. జయలలిత బయోపిక్ కోసం ఆయన ఐశ్వర్య రాయ్ ను .. అనుష్కను ఇద్దరినీ సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఐశ్వర్యరాయ్ ఓకే అంటే జాతీయస్థాయిలో ఈ ప్రాజెక్టు అందరి దృష్టిలో పడుతుంది.

తెలుగు .. తమిళ భాషల్లో అనుష్కకి మంచి క్రేజ్ వుంది. హిందీ ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితమే. నాయికా ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేయడంలో ఆమె స్థానం ప్రత్యేకం. ఇక ఈ సినిమాకి ‘పురిచ్చి తలైవి’ .. ‘అమ్మ’ అనే రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. డిసెంబర్లో ఈ సినిమాను లాంచ్ చేసే ఆలోచనలో వున్నట్టుగా సమాచారం. క్రేజీ సినిమా కావ‌డంతో ఇద్ద‌రిలో ఎవ‌రు అమ్మ పాత్ర ఎవ‌రికి ద‌క్కుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -