Monday, April 29, 2024
- Advertisement -

NTR30: భారీ సెట్‍లో ఎన్టీఆర్ జాన్వీ కపూర్ షూటింగ్..

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా “ఎన్టీఆర్ 30” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమా పై ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. వీరి కాంబినేషన్ లో ” జనతా గ్యారేజ్ ” బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మరి ఈసారి ఈ క్రేజీ కాంబినేషన్ ఏలాంటి సంచలనలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

NTR30 షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని.. రెండో షెడ్యూల్ మొదలు కానున్నట్లు తెలుస్తుంది. రెండో షెడ్యూల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ ఇందుకు వేదిక కానున్న టు సమాచారం. షెడ్యూల్‍లో హీరోయిన్ జాన్వీ కపూర్ తో సన్నివేశాలు షూటింగ్ ఉండనున్నట్లు సమాచారం.

NTR30 సినిమాన్ని తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై కొస‌రాజు హ‌రికృష్ణ‌, సుధాక‌ర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినీ ఇండ‌స్ట్రీలో టాప్ టెక్నీషియ‌న్స్‌గా పేరున్న సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ సాబు సిరిల్‌, ఎడిట‌ర్ శ్రీక‌ర ప్ర‌సాద్ ఈ చిత్రానికి వ‌ర్క్ చేస్తున్నారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -