Saturday, April 27, 2024
- Advertisement -

పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా..!

- Advertisement -

గోవా హాట్ బ్యూటీ ఇలియానా తెలుగు వెండి తెరపై వైవియస్ చౌదరి దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన “దేవదాసు”సినిమా ద్వారా పరిచయం అయ్యి తర్వాత వచ్చిన పోకిరి, జల్సా, కిక్,రాఖీ వంటి సినిమాల్లో అగ్ర కథానాయకుల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ వున్న సమయంలోనే బాలీవుడ్ వైపు పయనమైంది. అక్కడ మంచి అవకాశాలు దక్కడంతో ఇలియానా బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యిందని అందరూ భావించారు.

ఇలియానా తన ప్రియుడు ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో సహజీవనంలో ఉన్నప్పుడు తన గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా తను తల్లికాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా స్వయంగా ఇలియానానే వెల్లడించింది. ఆ ఇన్ స్టా పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండు ఫొటోలను షేర్ చేస్తూ ఒక ఫొటోలో ‘అడ్వెంచర్ మొదలైంది’ అనే క్యాప్షన్ తో ఉన్న టీషర్ట్ ఉండగా.. మరో ఫొటోలో తన మెడలో వేలాడుతున్న ఓ పెండెంట్ ను చూపించింది. ఆ పెండెంట్ పై మామా (అమ్మ) అనే ఇంగ్లిష్ అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఫొటోల కింద ‘కమింగ్ సూన్’ అంటూ క్యాప్షన్ జతచేసింది. మై లిటిల్ డార్లింగ్.. నిన్ను కలిసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నానంటూ ఇలియానా తన పోస్టులో పేర్కొన్నారు. దీంతో ఇలియానా అభిమానులు ఆ బిడ్డ తండ్రిని పరిచయం చేయాలంటూ కామెంట్లు రూపంలో రిక్వెస్ట్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -