Sunday, May 12, 2024
- Advertisement -

శ్రీదేవి కూతురిని ప‌డేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

- Advertisement -

టాలీవుడ్ సన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ మంచి జోష్‌లో ఉన్నాడు.ఇటీవ‌లే విజ‌య్ న‌టించిన టాక్సీవాలా సినిమా విజ‌య‌వంతంగా థియోట‌ర్ల‌లో న‌డుస్తుంది.60 కోట్ల షేర్ రాబట్టగలిగే రేంజ్ కు చేరుకున్న విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఫిలిం నగర్ జనానికి అంతు చిక్కడం లేదు. సినిమాలో యావరేజ్ కంటెంట్ ఉన్నా చాలు బ్లాక్ బస్టర్ కు తగ్గకుండా హిట్ కొట్టిస్తున్నారు ప్రేక్షకులు. టీవీలో సైతం ఇండస్ట్రీ హిట్స్ ని మించిన టిఆర్పి రేటింగ్స్ వస్తున్నాయి.ఇప్పుడు విజయ్ క్రేజ్ ఒక్క టాలీవుడ్‌కే ప‌రిమితం కాలేదు.మ‌నోడికి నార్త్ లో కూడా భీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు.

అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మనసును కూడా గెలుచుకున్నాడు. ఇటీవలే కాఫీ విత్ కరన్ షోలో అన్నయ్య అర్జున్ కపూర్ తో కలిసి పాల్గొన్న జాన్వీ కపూర్ ని యాంకర్ కరన్ జోహార్ ఓ ప్రశ్న వేసాడు. ఒకవేళ ఉదయాన్నే లేచినప్పుడు అబ్బాయిగా మారిపోవాల్సి వస్తే ఎవరిలా ఉండాలని కోరుకుంటావు అని అడిగాడు. అంతే వెంటనే తడుముకోకుండా విజయ్ దేవరకొండ పేరు చెప్పేసింది. అంతే కాదు త్వరలో సినిమా చేయాలని ఉంద‌ని త‌న మ‌న‌స్సులోని కోరిక‌ను కూడా బ‌య‌ట‌పెట్టింది జాన్వీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -