Sunday, May 19, 2024
- Advertisement -

మ‌ల్టీస్టార‌ర్‌లో పెద్దోడు చెర్రీగా, చిన్నోడిగా తార‌క్

- Advertisement -

ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న మల్టీస్టారర్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ అన్నదమ్ములుగా నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో చెర్రీ, తార‌క్ ఇద్దరూ అన్నదమ్ములుగా నటించబోతున్నారు. అయితే వీరిలో అన్నగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోంటే తమ్ముడిగా రామ్‌చరణ్ న‌టిస్తున్నార‌ని స‌మాచారం.

వ‌య‌సులోనూ.. సినిమాల ప‌రంగా ఎన్టీఆర్ సీనియర్ కావ‌డంతో అన్నగా ఎంపిక చేశారు. పెద్దోడు, చిన్నోడుగా చెప్పొచ్చు. పెద్దోడైనా చిన్నోడైనా పాత్రల్లోనే.. కానీ నిడివిలో తేడా ఉండదనేది టాక్. ఈ సినిమా కోసం ఇటీవ‌ల అమెరికాకు రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ వెళ్లివ‌చ్చారు. ఒక్కరోజు కోసం మాత్రమే వీళ్లు అక్కడికి వెళ్లి ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. ఈ ఫొటోస్‌ను త్వ‌ర‌లో విడుదల చేసే అవకాశం ఉంది.

దీన్ని బట్టి ఇది ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనరని తెలుస్తోంది. రాజమౌళి మార్క్ యాక్షన్ అండ్ ఎమోషన్ కూడా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి తర్వాత రాజ‌మౌళి చేస్తున్న సినిమా కావ‌డంతో అభిమానులు, ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -