మాటల మాత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆజ్ణాత వాసి డిజాస్టర్ తర్వాత ప్రతీష్టాత్మకంగా ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నారు త్రివిక్రమ్. ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది.
ఇంతకుముందు సినిమాల్లో ఎన్టీఆర్ కనిపించిన లుక్స్ కి పూర్తి భిన్నమైన లుక్ లో ఆయన కనిపించనున్నాడు. ఫిట్ నెస్ తో కనిపించడం కోసం ఎన్టీఆర్ గట్టి కసరత్తులే చేస్తుండగా, మేకప్ పరంగా ఆయనని కొత్తగా చూపించడం కోసం హాలీవుడ్ నుంచి స్పెషల్ మేకప్ మేన్ ను రప్పించారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా అనగానే అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టాలీవుడ్లో మరో రికార్డ్ బ్రేకింగ్ సినిమా రాబోతోందనే అంటున్నారు సినీ విశ్లేషకులు అంటున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. హారికా హాసిని బ్యానర్ లో చినబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అద్భుతమైన స్క్రిప్ట్‌ను అందించారని సమాచారం. తారక్‌ని ఈ సినిమాలో కొత్త అవతారంలో చూడబోతున్నాం. ఇటీవల ఎన్టీఆర్ మహానటి సినిమా వేడుకకు వచ్చినప్పుడు ఎన్టీఆర్ లుక్ చూసి అభిమానులు ఫిదా అయ్యారు. బయట ఇలా కనిపిస్తే సినిమాలో ఎలా ఉంటాడోనని అంటున్నారు జనాలు
ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని చెప్పిన దగ్గర నుంచి, టైటిల్ ఎలా వుండనుందనే విషయంలో అంతా దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలో ‘అసామాన్యుడు’ అనే టైటిల్ తెరపైకి వచ్చింది. ఈ టైటిల్ పట్ల త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ ఆసక్తిని చూపుతున్నారట. ఇదే టైటిల్ ను త్వరలో ప్రకటించనున్నట్టు సమాచారం.
