Sunday, May 19, 2024
- Advertisement -

మండుటెండల్లో జగన్ జన ప్రభంజనం….. ఎసి ఎఫెక్ట్ ఇచ్చినా బాబు సభలు వెల వెల

- Advertisement -

చంద్రబాబు సభలు…….ఆయన ఒక రోజు దీక్ష ఏర్పాట్లు చూశారా ఎప్పుడైనా? ఎసిలు, కూలర్లు, టెంట్లు, షామియానాలు, కుర్చీలు….ఇంకా ఆ సభ ప్రాంగణం మొత్తం కూడా చల్లగా ఉండేలా ఏర్పాట్లు………. ఇక కూలింగ్ వాటర్ నుంచి బిర్యానీల వరకూ అన్నీ షరామామూలే. అయితేనేం బాబు సభలకు జనాలను తరలించడం……. ఆ వచ్చిన జనాలను బాబు ప్రసంగం అయ్యే వరకూ కూర్చోబెట్టడం మాత్రం టిడిపి నాయకులకు, అధికారులకు, పోలీసులకు కనాకష్టమవుతోంది. ఒక రోజు దీక్ష…… అంటే రోజు మొత్తం కాదు……. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత నుంచీ సాయంత్రం వరకూ….బాబుగోరు ఎసి ఎఫెక్ట్‌లో దీక్ష చేయడం కోసం 30 కోట్లు ఖర్చు చేసినప్పటికీ జనాలు మాత్రం రాలేదు. ఇక నిన్న ఇంకేదో పేరుతో భారీ సభ అంటూ పచ్చ మీడియా ఎంత ఊదరగొట్టినా కుర్చీలన్నీ ఖాళీగానే కనిపించాయి. బాబు సభలు వెలవెలా పోవడం కంటే కూడా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా జగన్ ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న జన ప్రభంజనం మాత్రం పచ్చ బ్యాచ్ జనాల గుండెల్లో మంటలు రేపుతోంది.

మండుటెండలు…… అది కూడా సూర్యుడి నడినెత్తి మీదకు వస్తున్న సమయాలలో కూడా జగన్ కోసం జనాలు వేచి చూస్తూ ఉండడం………. మేడల మీద, గోడలపైన, రోడ్లపైన ఎండలో నిలబడి జగన్ కోసం జనాలు ఎదురుచూస్తూ ఉండడం…… జగన్ మాటలకు, బాబుని విమర్శిస్తున్నప్పుడు జగన్ అడుగుతున్నప్రశ్నలకు విశేషంగా స్పందిస్తున్నారు జనం. ఈ విషయమే బాబు అండ్ కోకి మంటెత్తిపోయేలా చేస్తోంది. అందుకే అందరూ కూడా చిరంజీవికి కూడా జనాలు వచ్చారు…….. ఓట్లు పడ్డాయా అన్న రాగం అందుకున్నారు. అయితే సినిమా నటుడి చూడడానికి జనాలు వస్తారు……….. కానీ రాజకీయ నాయకుడిని చూడడానికి రారు……… యన మాటలు వినడానికి, ఆయనపై అభిమానంతోనే వస్తారు అని రాజకీయ మేధావులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా ఒక వైపు సర్వీలన్నీ కూడా 2019 ఎన్నికల్లో బాబు ఓటమి, జగన్ గెలుపు ఖాయం అని చెప్తున్నాయి. ఇక జగన్ జన ప్రభంజనం ……… బాబు సభలు వెలావెలా పోవడం చూస్తూ ఉంటే మాత్రం ప్రజల నాడి తెలిసిపోతూనే ఉందన్న అభిప్రాయాలు ఆంధ్రప్రదేశ్ నాట సర్వత్రా వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -