Friday, March 29, 2024
- Advertisement -

135 కోట్లు క‌లెక్ట్ చేసిన ‘అర‌వింద స‌మేత‌’

- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ , మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమా అర‌వింద స‌మేత‌.సినిమా మొద‌టి ఆట నుంచే సూప‌ర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక సినిమా మొద‌టి రోజున 60 కోట్లు క‌లెక్ట్ చేసి నాన్ – బాహుబ‌లిగా రికార్డు సృష్టించింది. కేవలం 8 రోజుల్లోనే ఈ సినిమా ఇటు త్రివిక్రమ్ కెరియర్లోనూ.. అటు ఎన్టీఆర్ కెరియర్లోను అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది.

తొలి 4 రోజుల్లో ఈ సినిమా 111.80 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి, ‘రంగస్థలం’ .. ‘భరత్ అనే నేను’ తొలి వీకెండ్ వసూళ్ల రికార్డులను అధిగమించింది. 8 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 135 కోట్ల వసూళ్లను రాబట్టింది. గతంలో ఎన్టీఆర్ చేసిన ‘జై లవ కుశ’ సినిమా లాంగ్ రన్నింగ్ లో 131 కోట్లను వసూలు చేసింది. ఇక ‘జనతా గ్యారేజ్’ కూడా లాంగ్ రన్నింగ్ లో 134 కోట్ల వరకూ రాబట్టింది. కేవలం ఎనిమిది రోజుల్లోనే ‘అరవింద సమేత’ 135 కోట్లను వసూలు చేసి రికార్డును సృష్టించింది. మొత్తానికి అరవింద సమేత వీర రాఘవుడు తొలివారంలోనే తన సత్తా చాటేశాడన్న మాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -