ఆస్కార్ బెస్ట్ యాక్టర్ ప్రిడిక్షన్ లిస్టులో Jr.NTR..!

Jr.NTR in Oscar best actor predictions list..!
Jr.NTR in Oscar best actor predictions list..!

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్( రౌద్రం రణం రుధిరం). అగ్ర హీరోలు కలిసి నటించిన సినిమా అందర్నీ ఆకట్టుకుంది. రాజమౌళి చరిత్రలో కలవని ఇద్దరు యోధులను ఈ సినిమా ద్వారా కలిపి చరిత్ర సృష్టించారు. స్వాతంత్ర సమరయోధుల నేపథ్యంలో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల పెర్ఫార్మెన్స్ అశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ నటనకు ఫిదా కానీ ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు , కన్నడ , మలయాళం, తమిళ , హిందీ భాషల్లో విడుదలై కలెక్షన్ల పరంగానే కాదు, హాలీవుడ్ సినిమాలతో కూడా పోటీపదింది. థియేటర్లలోనే కాదు ఓటీపీ లోను ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పటికే ‘నాటు- నాటు’ సాంగ్ ను ఆస్కార్ షార్ట్ లిస్ట్ చేసింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ’నాటు నాట’,’కొమురం భీముడ’ సాంగ్స్ టాప్ -5 లో చోటు దక్కించుకున్నాయి. దీనితో పాటు ఇప్పుడు ఆస్కార్ బెస్ట్ యాక్టర్ ప్రిడిక్షన్ లిస్టులో టాప-10 లో ఎన్టీఆర్ నిలిచాడు. ఇండియన్ సినిమా చరిత్రలో తొలిసారిగా ఓ భారతీయ నటుడు టాప్-10 ఆస్కార్ అంచనాల జాబితాలో చోటు దక్కించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్.

ఇవి కూడా చదవండి

వింత జబ్బులతో బాధపడుతున్న సెలబ్రిటీలు వీరే..!

బాలయ్య షో లో మంత్రి కెటిఆర్, రామ్ చరణ్?

ఒక్క డైలాగ్‌తో సినిమా హిట్!