Friday, April 26, 2024
- Advertisement -

ఎన్టీఆర్‌కి ఆపరేషన్…….. నందమూరి చెప్పిన అసలు నిజాలు ఇవిగో…. డాక్టర్స్ అభిప్రాయాలు ఇవి

- Advertisement -

టెంపర్ సినిమాలో సిక్స్‌ప్యాక్‌తో, నాన్నకు ప్రేమతో సినిమాలో పర్ఫెక్ట్ ఫిజిక్‌తో కనిపించిన ఎన్టీఆర్ జైలవకుశ సినిమాలో మాత్రం కాస్త లావుగా కనిపించాడు. అది కూడా క్యారెక్టర్ డిమాండ్ చేయడంతో జై క్యారెక్టర్ కోసం పెరగాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా షూట్‌కి టైం అవ్వడంతో లావు తగ్గడానికి ఎన్టీఆర్ ఆపరేషన్ చేయించుకున్నాడన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అది కూడా కొన్ని మీడియా సంస్థలు ఈ రూమర్‌ని బాగా స్ప్రెడ్ చేశాయి. త్రివిక్రమ్ సిిినిమాల్లో ఉండే హీరోలందరూ అర్బన్ బేస్డ్ క్యారెక్టర్స్ అండ్ అందంగా ఉండేవాళ్ళే కాబట్టి త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ కూడా అందంగా కనపడడం, సన్నగా కనపడడం ఖాయమన్న విషయం ఎవరైనా ఊహించగలిగేదే.

ఆ ఊహలకు రెక్కలు తొడిగేసి ఎన్టీఆర్‌కి ఆపరేషన్ అన్న వార్త వండేశారు రూమర్ రాయుళ్ళు. అయితే అది పూర్తిగా తప్పని నందమూరి వర్గాలు చెప్తున్నాయి. ఎన్టీఆర్‌కి అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తి చెప్పిన దాని ప్రకారం ఆ రూమర్‌లో చెప్పినట్టుగా కేవలం ఐదు కేజీలు తగ్గడానికి ఎన్టీఆర్ ఆపరేషన్ చేయించుకుంటాడా? గట్టిగా ఇరవై రోజులు డైట్ మెయింటెయిన్ చేసి ఫిట్నెస్ కార్యక్రమాలు చేస్తే తగ్గే వెయిట్ కోసం ఆపరేషన్ చేయించుకుని ఆరు నెలలపాటు రెస్ట్ తీసుకోవాల్సిన దుస్థితి ఎందుకు తెచ్చుకుంటాడు అని చెప్పాడు ఆ ఎన్టీఆర్ స్నేహితుడు. బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్న మాట నిజం. అయితే తన ఫిట్నెస్ యాక్టివిటీస్‌తోనే బరువు తగ్గుతున్నాడు ఎన్టీఆర్ అని ఆయన చెప్పాడు.

ఇక డాక్టర్స్ కూడా ఈ రూమర్స్ కొట్టిపారేస్తున్నారు. ఐదు కేజీలు తగ్గడం కోసం ఆపరేషన్ చేయించుకునే ప్రయత్నం ఎవరూ చేయరని చెప్పుకొచ్చారు డాక్టర్స్. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో వెయిట్ లాస్ ఆపరేషన్స్ చేయించుకుంటే ఆ తర్వాత ఆయన డ్యాన్స్‌లు, బాడీ మూమెంట్స్ అన్నీ తగ్గిపోతాయని, చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, అందుకే అలాంటి ప్రయత్నం చేసే అవకాశం లేదని చెప్పుకొచ్చారు. సో…….గాసిప్పురాయుళ్ళందరూ ఇప్పటికైనా కాస్త మెదడు కూడా వాడితే బెటరేమో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -