Sunday, May 19, 2024
- Advertisement -

ఆ తల్లికి, కూతురికి ఏజ్ తేడా.. జస్ట్ ఏడాదే

- Advertisement -

ఎక్కడైనా తల్లికి,బిడ్డకు ఏజ్ ఎంత తేడా ఉంటుంది. మనకు తెలిసినంత వరకు మినిమమ్ 18నుంచి ఆ పైనే ఉంటుంది. మరి ఆ రోజుల్లో అయితే అమ్మాయిలకు 13,14లకే పెళ్లిళ్లు చేసేసేవారు కాబట్టి… అప్పటి లెక్కలను చూసుకున్నా మినిమమ్ 14,15 ఉండేది. ఇప్పటి రోజుల్లో అయితే మినిమమ్ 26నుంచి పైనే కనిపిస్తుంది. కాని అదేంటో అమెరికాలోకి ఓ మహిళకు తనకు పుట్టిన కుమార్తెకు ఏజ్ గ్యాప్ జస్ట్ ఏడాదే ఉండటం అక్కడ చర్చనీయాంశమైంది. అక్కడనే కాదు ఇక్కడ కూడా ఆ న్యూస్ కాస్త ఇంట్రెస్టింగే మ్యాటరే అని చెపుకోవాలి.

ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. 25 సంవత్సరాలుగా శీతలీకరణ స్థితిలో ఉన్న ఓ పిండం పసిపాపగా ప్రాణం పోసుకుంది. రెండు దశాబ్దాల క్రితం అనగా 1992 అక్టోబరులో ఓ దాత నుంచి సేకరించిన ఒక పిండాన్ని వైద్యులు శీతలీకరణతో భద్రపరిచారు. ఈ ఏడాది మార్చిలో 26ఏళ్ల ఓ అమెరికన్‌ మహిళ గర్భంలోకి ఆ పిండాన్ని ప్రవేశపెట్టడంతో ఆమె గర్భందాల్చింది.ఈ నవంబర్‌ 25న ఆమె పండంటి పాపకు పునర్జన్మనిచ్చింది.

నిజానికి ఫొటోలో కనిపిస్తోన్న టీనాకు… ఆమె భర్తలో కొన్ని జన్యుపరమైన సమస్యలు కనుగొంది. దాంతో ఇక చేసేది లేక దాత నుంచి సేకరించిన పిండం ద్వారా బిడ్డను కనాలనుకున్నారు. ‘అమెరికా నేషనల్‌ ఎంబ్రియో డొనేషన్‌ సెంటర్‌’ మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జెఫెరే కీనన్‌ ఆధ్వర్యంలో పాతికేళ్లనాటి పిండాన్ని టీనా గర్భంలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ప్రవేశపెట్టబడిన ఆ పిండం ఎప్పటిదని ఈమెకు తెలియదు. తర్వాత తెలిసింది. ఇపుడు ఆ పాప వయస్సుకు ఈమెకు… ఏజ్ గ్యాప్ లెక్క కడితే జస్ట్ ఏడాది మాత్రమే తేడా అని తెలిసింది. ఈ క్రిస్ట్ మస్ కు ఈ పాప దేవుడిచ్చిన వరంగా టీనా చెబుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -