Saturday, May 18, 2024
- Advertisement -

బిగ్‌బాస్‌-2 షోకు షాకిచ్చిన యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌

- Advertisement -

బిగ్‌బాస్ షోలో ఇక యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ నంద‌మూరి తార‌క రామారావు క‌నిపించ‌క‌పోవ‌చ్చు. గ‌తంలో బిగ్‌బాస్ షోకు ఎన్టీఆర్ రావ‌డంతో షోకు క్రేజీ ఏర్ప‌డింది. మ‌ల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్న ఎన్టీఆర్‌ జై లవకుశ సినిమాతో త‌న కెరీర్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశాడు. బుల్లి తెరపైనా హోస్ట్‌గా ఇరగదీశాడు. మ‌ళ్లీ బిగ్ బాస్-2లో ఉన్నాడ‌ని స‌మాచారం వ‌చ్చింది. కానీ ఇప్పుడు మ‌ళ్లీ ఆ షోలో క‌నిపించే అవ‌కాశం లేదు.

త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా మార్చి 23వ తేదీ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. దీంతో బిగ్‌బాస్ షోకు డేట్స్ ఖాళీగా లేవు. ఈ సినిమా త‌ర్వాత రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చరణ్‌తో కలిసి భారీ మల్టీస్టారర్ సినిమా చేయ‌నున్నాడు. ఈ రెండు సినిమాలూ పెద్ద‌వి కావ‌డంతో ఆ షోకు స‌మ‌యం కేటాయించ‌లేక‌పోతున్నాడు. ఈ టైమ్‌లో మళ్లీ బిగ్‌బాస్ వైపు మైండ్ డైవర్ట్ చేయడం స‌రికాద‌ని తప్పుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈ జూలైలో ప్రారంభం కాబోతున్న బిగ్‌బాస్-2లో ఎన్టీఆర్ మెరుపులు ఉండవని తెలుస్తోంది. ఈ వార్త ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు నిరాశ క‌లిగించేదే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -