Saturday, April 27, 2024
- Advertisement -

ఎన్టీఆర్, రామ్ చరణ్ కు ఆస్కార్ ?

- Advertisement -

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్( రౌద్రం రణం రుధిరం). అగ్ర హీరోలు కలిసి నటించిన సినిమా అందర్నీ ఆకట్టుకుంది. రాజమౌళి చరిత్రలో కలవని ఇద్దరు యోధులను ఈ సినిమా ద్వారా కలిపి చరిత్ర సృష్టించారు. స్వాతంత్ర సమరయోధుల నేపథ్యంలో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల పెర్ఫార్మెన్స్ అశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ నటనకు ఫిదా కానీ ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు , కన్నడ , మలయాళం, తమిళ , హిందీ భాషల్లో విడుదలై కలెక్షన్ల పరంగానే కాదు, హాలీవుడ్ సినిమాలతో కూడా పోటీపదింది. థియేటర్లలోనే కాదు ఓటీపీ లోను ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆస్కార్ లో ఈ సినిమాకి అవార్డులు రావాలని ప్రతి ప్రేక్షకుడు కోరుకున్నాడు.

ఈ మధ్యనే ఎన్టీఆర్ పేరు బెస్ట్ యాక్టర్ గా ఆస్కార్ లిస్టులో చోటు దక్కిందని ప్రపంచ ఫేమస్ మ్యాగజిన్ వెరైటీలో ప్రచురించింది. అప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. తాజాగా మరో అప్డేట్ ఈ మ్యాగ్జిన్ ఇచ్చింది. ఎన్టీఆర్ తో పాటు బెస్ట్ యాక్టర్ గా రామ్ చరణ్, బెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళి లకు ఆస్కార్ వచ్చే అవకాశం ఉందని ప్రకటించింది. దీంతో ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ వంతు అయ్యింది.

Also Read : అక్టోబర్ 3న ఆదిపురుష్ టీజర్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -