Monday, May 20, 2024
- Advertisement -

చేతికి క‌ట్టుతో జూనియ‌ర్ ఎన్టీఆర్ పోటో…సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

- Advertisement -

టాలీవుడ్ లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ముందువరుసలో ఉంటారు. గత కొన్నేళ్లుగా ఆయన నటిస్తున్న చిత్రాల్లో పరాజయం పాలైనవి చాలా తక్కువ. ప్ర‌స్తుతం యంగ్ టైగర్ టాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమురం భీం పాత్ర పోషిస్తున్నారు. హైద‌రాబాద్‌లో ఎన్టీఆర్‌పై కొన్ని కీల‌క సన్నివేశాలు చిత్రీక‌రిస్తుండ‌గా, ఆయ‌న‌ చేతి మ‌ణిక‌ట్టుకి గాయ‌మైంది. దీంతో విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఈరోజు (మే 5) ఎన్టీఆర్ పెళ్లిరోజు. ఎనిమిదేళ్ల క్రితం లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారు. నేడు పెళ్లిరోజు సందర్భంగా భార్య ప్రణతితో దిగిన లేటెస్ట్ ఫొటోను ఎన్టీఆర్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ‘ఎనిమిదేళ్లు!! ఇలాంటివి ఎన్నో రావాలని ఎదురుచూస్తున్నా’ అని సింపుల్ క్యాప్షన్ కూడా పెట్టారు.

అయితే ఫోటోలో ఎన్టీఆర్ చేతికి క‌ట్టు ఉండ‌డాన్ని చూసిన అభిమానులు ఈయ‌న చిత్ర షూటింగ్‌లో పాల్గొన‌డానికి మ‌రింత టైం ప‌ట్టొచ్చ‌నే అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే చ‌ర‌ణ్ కాలికి గాయం కార‌ణంగా చిత్ర షూటింగ్ కొద్ది రోజుల పాటు వాయిదా ప‌డింది.

ఈ పోస్టు పెట్టారో లేదో అభిమానులు విపరీతంగా స్పందిస్తున్నారు. వేల సంఖ్యలో లైకులు, షేర్లతో ఫేస్ బుక్ ను హోరెత్తిస్తున్నారు.2011లో ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి పెళ్లి జరిగింది. వీరికి అభయ్ రామ్, భార్గవరామ్ అనే కుమారులున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -