Sunday, May 19, 2024
- Advertisement -

ఎన్టీఆర్ కు రారమ్మని పిలుపు

- Advertisement -

నందమూరి వంశస్ధుడు.. యంగ్ హీరో జూనియర్ ఎన్ టి ఆర్ బాలీవుడ్ లో అడుగుపెగుతున్నారు. అయితే హీరోగా కాదులెండి. గాయకుడిగా బాలీవుడ్ లో ప్రవేశించనున్నాడు ఎన్టీఆర్. తెలుగు, కన్నడ భాషల్లో పాటలు పాడి శభాష్ ఆనిపించుకున్న ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఓ ఆల్బమ్ లో పాట పాడేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ కోరిక మేరకు ఈ పాట పాడుతున్నట్లు టాక్. ఎన్టీఆర్ కు, హృతిక్ రోషన్ కు మంచి స్నేహం ఉంది. ఒకరి సినిమాలు మరొకరు చూసి అభినందించుకోవడం వారిద్దరికి అలవాటు. నాన్నకు ప్రేమతో సినిమా చూసిన హృతిక్ రోషన్ సినిమా అద్భుతం అంటూ ట్విట్ చేశాడు. ఎన్టీఆర్ పాటలు కూడా విన్న హృతిక్ అతని చేత ఓ పాట పాడించాలని డిసైడ్ అయిపోయాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య చర్చలు జరిగాయని, ఎన్టీఆర్ ఒకె చెప్పాడని అంటున్నారు. ఈ కొత్త ఆల్బమ్ కి సంగీత దర్శకులు విశాల్, శేఖర్ స్వరాలు అందజేయనున్నారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -