Friday, May 17, 2024
- Advertisement -

ప్రధాని మోదీపై మమత ఫైర్..

- Advertisement -

భయానక్ జైల్ పార్టీ. ఇదేదో కొత్త పార్టీ అనుకునేరు. అదేం కాదు. భారతీయ జనతా పార్టీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి పెట్టిన పేరు. ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తనపై చేసిన వ్యాఖ్యలకు దీదీ ఘాటుగా సమాధానమిచ్చారు.

బిజెపి అంటే భయానక్ జైల్ పార్టీ అని ఆమె మండిపడ్డారు. శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో తనకు తానే పోటీ అని కూడా ఆమె అన్నారు. ఏదో ఒక కారణంతో ప్రధాని నన్ను అరెస్టు చేయించవచ్చు. అయినా నేను ఆయన ముందు తలవంచను. పశ్చిమ బెంగాల్ బిడ్డల గౌరవాన్ని తగ్గించను అని దీదీ అన్నారు. ఎవరైనా పెద్ద పెద్ద ప్రసంగాలు చేయడం సులువేనని, వాటిని అమలు చేయడంలోనే అసలు రహస్యం దాగుందని మమతా బెనర్జి వ్యాఖ్యానించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -