- Advertisement -

ఎన్టీఆర్-త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్!

- Advertisement -

టాలీవుడ్ సెన్సేషనల్ కాంబినేషన్ అయిన ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్ళీ జతకడుతుండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రకటన కోసం చిత్ర యూనిట్ ఒక భారీ అనౌన్స్‌మెంట్ వీడియోను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

ఎన్టీఆర్ పుట్టినరోజైన మే 20వ తేదీన ఈ సినిమాను అధికారికంగా ప్రకటించడమే కాకుండా, ఒక గ్లింప్స్ తరహాలో ఉండే హై-క్వాలిటీ వీడియోను విడుదల చేసేందుకు త్రివిక్రమ్ బృందం కసరత్తు చేస్తోంది.

ఈ అనౌన్స్‌మెంట్ వీడియోలో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) అత్యున్నత స్థాయిలో ఉండబోతున్నాయని, ఆ క్వాలిటీ విషయంలో త్రివిక్రమ్ ఎక్కడా రాజీ పడటం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ లైనప్‌లో ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్, దేవర-2 వంటి క్రేజీ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు త్రివిక్రమ్‌తో సినిమా కూడా లైన్లోకి రావడంతో తారక్ ఫ్యాన్స్‌కు ఈ ఏడాది బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా ఉండదని అర్థమవుతోంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మే 20న వెల్లడి కానున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -