రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం శరవేగంగా ముస్తాబవుతోంది. జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఒక కీలక సమాచారాన్ని పంచుకున్నారు.
సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎక్కడా ఆలస్యం లేకుండా చాలా సాఫీగా సాగుతున్నట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన ఫైనల్ ఎడిటింగ్ పూర్తయిందని, ఎడిట్ వెర్షన్‌ను మేకర్స్ లాక్ చేశారని తెలుస్తోంది.
ఎడిటింగ్ పూర్తయిన నేపథ్యంలో త్వరలోనే ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డు ముందుకు తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ సన్నద్ధమవుతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో అభిమానులు ప్రచార చిత్రాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.ముఖ్యంగా ఏ.ఆర్. రెహమాన్ అందించిన పాటలు, సినిమా ట్రైలర్ గురించి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
చిత్ర బృందం దశలవారీగా ప్రమోషన్లను ప్లాన్ చేస్తోందని, అతి త్వరలోనే అధికారిక ప్రకటనలు వెలువడనున్నాయని సమాచారం. వృద్ది సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ మరియు జగపతి బాబు వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో, ఒక గ్రామీణ క్రీడ నేపథ్యంలో సాగే భావోద్వేగమైన పాత్రలో కనిపించనున్నారు.
