ఎన్టీఆర్ కుటుంబంతో షార్ట్ వెకేషన్ ట్రిప్..

Jr NTR Vacation Trip With Family
Jr NTR Vacation Trip With Family

ప్రస్తుతం కొరటాల శివతో కలిసి దేవర సినిమా చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వేసవిలో చిల్ కావడానికి కుటుంబంతో కలసి వెకేషన్ ట్రిప్ కు వెళ్లారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే భార్య, పిల్లలతో కలిసి నెల రోజుల పాటు లాంగ్ వెకేషన్ ట్రిప్… అమెరికాలో ఎంజాయ్ చేసి వచ్చారు ఎన్టీఆర్.

అయితే ఇప్పుడు కుటుంబంతో కలసి షార్ట్ వెకేషన్ ట్రిప్ వెళ్లారు. గత రాత్రి భార్య లక్ష్మీ ప్రణతి, కొడుకులు ఆభయ్, భార్గవ్ రామ్‍లతో కలసి హైదరాబాద్ ఎయిర్‍పోర్టులో జూ. ఎన్టీఆర్ దర్శనమిచ్చారు. హాలిడే ట్రిప్ కోసం ఎన్టీఆర్ అండ్ ఫ్యామిలీ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌ వచ్చారు.
ప్రస్తుతం ఈ ఫొటోస్, వీడియోస్ వైరల్ అవుతున్నాయి.

ఎన్టీఆర్ తిరిగి వారం రోజుల తర్వాత హైదరాబాద్ చేరుకోనుండగా.. ఆ తర్వాత కొరటాల శివ తీస్తున్న దేవర షూటింగ్‍లో పాల్గొంటారని సమాచారం.