Thursday, May 2, 2024
- Advertisement -

సోష‌ల్‌మీ డియాలో వైర‌ల్ అవుతున్న ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి ఫోటో

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తండ్రి కాబోతున్నారు. ఆయన భార్య లక్ష్మీ ప్రణతి గర్భవతిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్, ప్రణతి దంపతులకు నాలుగేళ్ల కుమారుడు అభయ్ రామ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రణతి రెండో సంతానానికి తల్లి కానుందని.. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.

అయితే ఇప్పుడు ల‌క్ష్మీప్ర‌ణ‌తికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషియ‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. సాధార‌నంగానే ఎన్టీఆర్ భార్య ప‌బ్లిక్‌లో ఎక్కువ‌గా క‌నిపించ‌దు. గ‌ర్భ‌వ‌తిగా ఉన్న‌ప్పుడు అయితే వేరే చెప్పాల్సిన ప‌నిలేదు. రెండోసారి త‌ల్లిఅవుతున్న ల‌క్ష్మీప్ర‌ణ‌తి ఫోటో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో జ‌రిగిన బంధువుల పెళ్లివెల్లినప్పుడు తీసిన ఫోటో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి గ‌ర్భ‌వ‌తిగా ఉన్న ఫోటో కావ‌డంతో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

ల‌క్ష్మీప్ర‌ణ‌తి జూలైలో డెలివ‌రీ అయ్యే డేటు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి రానుంది. ఈ చిత్రానికి అనంతరం బాహుబలి మేకర్ రాజమౌళితో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. రాజమౌళి, త్రివిక్రమ్‌లతో వరుస హిట్స్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్న జూనియర్ ఎన్టీఆర్‌కు రెండో సంతానం కలుగనుందని తెలుసుకున్న నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -