Sunday, May 5, 2024
- Advertisement -

బిగ్ బాస్ షో లో జ్వాలా గుత్తా?

- Advertisement -

మరి కొద్దీ రోజుల్లో బిగ్ బాస్ కి సంబందించిన మూడో సీజన్ యొక్క అధికారిక ప్రకటన రానుంది. ఈ మూడో సీజన్ కి హోస్ట్ గా నాగార్జున ఉంటారు అనే వార్తలు బయటకు వస్తున్నా ఇప్పటికి అయితే ఒక క్లారిటీ మాత్రం రాలేదు. అయితే తాజా ఫిలిం నగర్ సమాచారం ప్రకారం స్టార్ మా నిర్వాహకులు ఇప్పటికే పలు సెలెబ్రిటీస్ తో చర్చలు జరిపారట. శ్రీ ముఖి, గుత్తా జ్వాలా వంటి వారు ఈ సారి షో లో మెరవనున్నారు అనే చర్చ నడుస్తున్న తరుణం లో సోషల్ మీడియా లో గుత్తా జ్వాలా తన పార్టిసిపేషన్ కి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది.

స్టార్ బాడ్మింటన్ ప్లేయర్ గా ఉన్న గుత్తా జ్వాలా అప్పుడప్పుడు మీడియా లో కొన్ని వివాదాల తో కనిపిస్తుంది. ఈ విడ షో లో ఉంటె బాగుంటుంది అని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు అనే వార్తలు వచ్చాయి కానీ గుత్తా జ్వాలా వాటిని పూర్తిగా ఖండించింది. తన జీవితం లో బిగ్ బాస్ లేదు అని చెప్తూ తాను ఈ షో లో పాల్గొనట్లేదు అనే సంకేతాలని క్లియర్ గా పంపించింది.

త్వరలో ఈ షో కి సంబంధించి పూర్తి వివరాలు బయటకు వస్తాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -