Saturday, May 4, 2024
- Advertisement -

సినిమాలు వ‌దిలేసి వ్యాపారంలో కాజ‌ల్‌

- Advertisement -

రెండు, సినిమాలకే టాప్ హీరోయిన్ ప‌రిమితం

చంద‌మామలాంటి అందం.. అమాయ‌క‌త్వం ఒల‌క‌బోసిన ముఖం.. అభిన‌యానికి వంక‌లేని న‌ట‌నతో ఆక‌ట్టుకున్న కాజ‌ల్ అగ‌ర్వాల్ త్వ‌ర‌లో సినిమాల‌కు బాయ్ బాయ్ చెప్ప‌నుందట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆ అమ్మ‌డే ప్ర‌క‌టించింది. అయితే ఇంకా రెండు, మూడు సినిమాల్లో న‌టించి సినీ ప‌రిశ్ర‌మ‌కు దూరంగా వెళ్తాన‌ని ప్ర‌క‌టించింది. ఈ విష‌యం ఆమె అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు మింగుడు ప‌డ‌ని విష‌యం.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తికాగానే సినీ రంగానికి స్వస్తి పలికి వ్యాపార రంగంలోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ పుకార్లపై కాజల్‌ ఓ ఆంగ్ల మీడియా ద్వారా స్పందించారు.‘సినిమాలు మానేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అయితే వెంటనే కాకపోయినా మరో మూడు, నాలుగుసార్లు సినిమాల్లో చేసి సినిమాలు వదిలి వేరే వ్యాపారాలు చేసే ఉద్దేశం అందని చెప్పుకొచ్చింది. ఈఏడాది ‘ఖైదీ నెం.150’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘వివేగం’, ‘మెర్సల్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్లో నటించా. ఇంత మంచి అవకాశాలు, విజయాలు వస్తున్నప్పుడు వెంటనే సినిమాలు మానేయాల్సిన అవసరం నాకేంటి?’ అని ప్ర‌శ్నించారు.

కాజ‌ల్ తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఓ వెలుగు వెలిగారు. ల‌క్ష్మిక‌ల్యాణంలో మెరిసి చందమామ సినిమాతో మంచి హిట్ కొట్టి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో పాతుకుపోయింది. దాదాపు ఓ ప‌దేళ్లు కాజ‌ల్ హ‌వా న‌డిచింది. మ‌గ‌ధీర‌, టెంప‌ర్‌, బాద్ షా, ఖైదీ నం 150, బృందావ‌నం, ఆర్య 2, సారొచ్చారు, స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌, డార్లింగ్‌, బ్ర‌హ్మోత్స‌వం, నాయ‌క్ త‌దిత‌ర సినిమాల్లో న‌టించింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -