Monday, May 6, 2024
- Advertisement -

కాజల్ అగ‌ర్వాల్‌ని లైన్లో పెట్టిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

- Advertisement -

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవ‌ర్‌నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు విజ‌య్ దేవ‌ర‌కొండ. ఈ సినిమా త‌రువాత మ‌నోడికి వ‌ర‌స సినిమాల‌లో అవ‌కాశాలు వ‌స్తున్నాయి. విజ‌య్ తాజాగా మ‌రో క్రేజీ ప్రొజెక్ట్‌లో హీరోగా న‌టిస్తున్నాడు.ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి చిత్రాలతో మంచి దర్శకుడు అనిపించుకొన్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్‌గా సీనియ‌ర్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను తీసుకున్నార‌ని స‌మాచారం.

కెరీర్ స్టార్టింగ్‌లో కుర్ర హీరోల‌తో సినిమాలు చేసిన కాజ‌ల్ మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు మ‌రోసారి ఓ యువ హీరోతో సినిమా చేస్తుంది.క్రాంతి మాధవ్ చెప్పిన కథ న‌చ్చ‌డంతో కాజ‌ల్ వెంటనే ఈ సినిమాను ఓకే చేసింద‌ట. విజ‌య్ దేవ‌ర‌కొండ – కాజ‌ల్ అగ‌ర్వాల్ ఈ కాంబో మాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు సమాచారం.సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంద‌ని తెలుస్తుంది.విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం గీత గోవిందం ,టాక్సీవాలా,సినిమాల‌తో పాటు మ‌రో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -