Friday, May 17, 2024
- Advertisement -

మోడీపై మళ్లీ చంద్రబాబు అవిశ్వాస తీర్మానం

- Advertisement -

నరేంద్రమోడీ సర్కార్ పై మరోసారి అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఏపీ సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. వచ్చే బుధవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఆ సమావేశాల్లోనే మోడీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి ఎండగడుతూ, ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఏపీకి అన్యాయం జరిగిందని, హోదా ఇవ్వాలని, పోలవరం, రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్రానిదే కనుక సరిపడా నిధులు మంజూరు చేయాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా మోడీ పట్టించుకోవడం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరును, మోడీ మొండి వైఖరిని నిరసిస్తూ తాము పెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు కాంగ్రెస్, వైఎస్ఆర్ సీపీ, బీజేపీ మినహాయించి దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు, విపక్షాలకు లేఖ రాశారు. ‘ముక్కలైన మాటలు’ పేరుతో ఆయన రాసిన 6 పేజీలలో లేఖలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం గురించి పూర్తిగా వివరించారు. తమ గోడు అర్ధం చేసుకుని, తాము పెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి పూర్తి సంఘీభావం తెలిపాలని కోరారు.

అయితే చంద్రబాబు కాంగ్రెస్, వైఎస్ఆర్ సీపీకి లేఖ రాయకపోయినా ఆ రెండు పార్టీలు ఎటూ అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలుపుతాయి. ఎందుకంటే స్వతహాగా బీజేపీని వ్యతిరేకించే పార్టీ కనుక కాంగ్రెస్ సై అంటుంది. ‘మోడీని ఎదిరించిన మొనగాడు’, ‘ రెండుసార్లు అవిశ్వాస తీర్మానం పెట్టిన ఘనుడు ‘…వంటి కీర్తికిరీటాలు చంద్రబాబు ఖాతాలో పడిపోకూడదనే వైఎస్ఆర్ సీపీ కూడా సై అంటుంది. కాకపోతే చంద్రబాబు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకుండా, తాము కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ నోటీసులు ఇచ్చి ఆ క్రెడిట్ కోసం పాకులాడతారు.

అంతవరకూ ఓకే. కానీ మీరు అవిశ్వాసం పెట్టండి. నేను దేశమంతా తిరుగుతాను. అన్ని పార్టీల మద్దతు కూడగడతాను. మోడీ ప్రభుత్వాన్ని కూల్చేద్దాం. ఏపీకి ప్రత్యేకహోదా సాధిద్దాం…అంటూ గతంలో జనసేన అధ్యక్షుడు పూనకంతో ఊగిపోతూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆయన కోరినట్లే టీడీపీ, వైఎస్ఆర్ సీపీ అవిశ్వాస తీర్మానం పెట్టాయి. కేంద్రమంత్రి పదవులకు టీడీపీ నేతలు రాజీనామా కూడా చేసేశారు. ఎన్టీఏ కూటమి నుంచీ బయటకు వచ్చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాసం పెట్టి ఎంత పోరాడినా, మోడీ సర్కార్ వాటిపై చర్చించలేక పారిపోయింది. ఓ వైపు టీఆర్ఎస్, మరో వైపు అన్నాడీఎంకే సభ్యులతో సభలో గలాటా సృష్టించి, సభ అదుపులో లేదు అనే కుంటి సాకు చెబుతూ అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టకుండానే పారిపోయింది. దేశమంతా తిరిగి మద్దతు కూడగడతానన్న పవన్ కళ్యాణ్ అడ్రస్ లేకుండా పోయాడు. ఉత్తరకుమార ప్రగల్భాలతో, అర్ధం పర్ధం లేని ఆవేశంతో పొడిచేస్తా, చించేస్తా.. అని ఊగిపోతూ ఉపన్యాసం ఇచ్చిన పవన్, తీరా అవిశ్వాస తీర్మానం పెట్టిన వేళ కనుమరుగైపోయాడు. ఇప్పుడు మళ్లీ అవిశ్వాసం పెట్టబోతున్నారు. ఈ సారైనా పవన్ తన ప్రయత్నాలు చేస్తాడా ? లేక గతంలో మాదిరిగా పారిపోతాడా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -