Saturday, May 4, 2024
- Advertisement -

చరణ్ సినిమాలో చాలా స్పెషల్స్ ఉన్నాయి..!

- Advertisement -

బ్రుస్ లీ చిత్రం తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ధృవ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం రెండు షెడ్యూల్స్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుందట. మూడో షెడ్యూల్ నుంచి చరణ్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన చిత్రం తనీ ఒరువన్ కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది.

ఈ సారి చెర్రీ ఎలాగైన భారీ హిట్ సొంతం చెసుకోవాలి అని చూస్తున్నాడు. అందుకో ఈ సినిమాలో ఇంట్రస్టింగ్ కాస్టింగ్ న్ సెట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ సరసన హీరోయిన్ గా మరోసారి రకుల్ ప్రీత్ కనిపిస్తుండగా, విలన్ గా తమిళ వర్షన్ లో నటించిన అరవింద్ స్వామినే మళ్లీ తెలుగు రీమేక్ కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మరో హీరో యువ నటుడు నవదీప్ కూడా నటించబోతున్నాడు. ఈ విషయాన్ని  నవదీప్ స్వయంగా చెప్పాడు.

అలాగే ఈ చిత్రంలో మరో స్పెషల్ ఉంది. చరణ్ తో కలిసి ఒక స్పెషల్ సాంగ్ లో చిందులేయనుందట కాజల్ అగర్వాల్. ‘ధ్రువ’ లో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఈ సాంగ్ సినిమాలో చాలా స్పెషల్ కావడంతో టాప్ హీరోయిన్ తో చేయిస్తే బాగుంటుందని అనుకున్నారట. అందుకే ఈ సాంగ్ కోసం కొంతమంది కథానాయికల పేర్లను పరిశీలించి .. చివరికి కాజల్ ను ఫైనల్ చేశారని అంటున్నారు. సో మొత్తాన్నికి చరణ్ భారీ హిట్ కొట్టడాని రెడీ అవుతున్నాడు. మరి ఇన్ని స్పెషల్స్ ఉన్నఈ చిత్రం చరణ్ కి ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -