Thursday, May 16, 2024
- Advertisement -

నీహారిక కోసం పవన్ ఏం చేస్తున్నాడో తెలుసా?

- Advertisement -

మెగా ఫ్యామిలీ లో అందరూ కలిసే ఉంటారు. ఒకే ఇంట్లో లేకున్న ఒకే మాటపై మాత్రం ఉంటారు అని అందరూ అంటారు. అయితే ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం ఇలాంటివి పట్టించుకోడు. బయట సంగతులు ఎలా ఉన్నా.. ఇంట్లో సంగతుల విషయంలో చాలాసార్లు పవన్ ఫ్యామిలీతో సరిగ్గా కలవడనేదీ నిజం. అయితే పవన్ స్టార్ కి అన్నలంటే ఎంత గౌరవమో కూడా అందరికీ తెలిసిందే.

చాలా సార్లు కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కలవని పవన్.. ఇప్పుడు మరో ఇంపార్టెంట్ విషయంలో కుటుంబ సభ్యులతో కలవబోతున్నాడట. అది ఎవరో కోసమో తెలుసా..? తన అన్న కూతురు నీహారిక కోసం. అవును.. మెగా ఫ్యామిలీ నుంచి మొదటి హీరోయిన్ గా నాగబాబు కూతురు నిహారిక వస్తుంది. నీహారిక హీరోయిన్ గా వస్తుందంటే మెగా అభిమానులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

అంటే మరి ఫ్యామిలీ వాళ్ల ఫీలింగ్స్ ఏంటో చెప్పలేం కదా. అందుకే .. అందరి కంటే ముందే తమ నిహారికను వెండితెరపై చూడాలని ఒక్క మనసు ప్రివ్యూ వేస్తున్నారు. కేవలం ఈ సినిమా ప్రివ్యూకి మెగా ఫ్యామిలీ మాత్రమే రాబోతుందట. అందులో ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నాడట. పవర్ స్టార్ వస్తున్నాడంటే ఇక నీహారిక ఆనందానికి హద్దేముందీ.. ఇక అందరికీ బాబాయి నా సినిమా ప్రివ్యూ వస్తున్నాడని చెప్పుకుంటుందట. మొత్తాన్నికి నీహారిక ఆనందం కోసం పవర్ స్టార్ వస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -