Friday, May 3, 2024
- Advertisement -

కాజల్ ఎదురు చూపులు ఫలించేనా?

- Advertisement -

ఎన్నో అంచనాల మధ్య కాజల్ అగర్వాల్ తెలుగు లో సీత అనే సినిమా తో మన ముందుకు ఇటీవల వచ్చింది. అయితే ఈ సినిమా అందరి అంచనాలని తారుమారు చేస్తూ పెద్ద పరాజయం పాలైంది. అందుకే ఇక తన తదుపరి చిత్రం రణరంగం మీదకి తన ఆశలని మళ్లించింది ఈ భామ. శర్వానంద్ ఈ సినిమా లో హీరో గా చేస్తున్నాడు.

ఈ సినిమా లో కాజల్ పాత్ర చాలా ప్రత్యేకం అంట. శర్వానంద్ తో సమానం గా తన పాత్ర కూడా ఉంటుంది అని తెలుస్తుంది. అయితే ఎంత వరకు కాజల్ కి కూడా ఈ సినిమా కలిసి వస్తుంది అనేది తెలియదు కానీ కాజల్ మాత్రం కచ్చితంగా ఈ సినిమా తనకి హెల్ప్ అవుతుంది అని వేచి చూస్తుంది. కాకపోతే ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ ఉంటె కాజల్ కి లోపల గుబులు పెనుగుతుంది అంట. అనవసరం గా నెగటివిటీ పెరుగుతుందేమో అని భయపడుతున్న కాజల్ ఈ సినిమా విడుదల త్వరగా అవ్వాలని ప్రార్తిస్తుంది.

ఈ సినిమా లో మరొక హీరోయిన్ పాత్ర లో కళ్యాణి ప్రియదర్శన్ నటించింది. సుధీర్ వర్మ ఈ సినిమా కి దర్శకుడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -