Monday, April 29, 2024
- Advertisement -

ఓటమిపై పవన్ సంచలన వ్యాఖ్యలు..

- Advertisement -

పవన్ కళ్యాణ్ రివ్యూ మొదలు పెట్టారు. ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత సైలెంట్ అయిన జనసేనాని.. రాజకీయాలను వదిలేస్తాడా అన్న సందేహం కలిగింది. అయితే జనసైనికులకు భరోసానిస్తూ పవన్ స్పందించారు. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన అసెంబ్లీ అభ్యర్థులు, కార్యకర్తలతో ముఖాముఖి మాట్లాడారు.

పవన్ తాను మరో 25 ఏళ్లు రాజకీయాల్లో ఉండాలనే ఉద్దేశంతోనే వచ్చానని.. ఓటములతో కృంగిపోనని.. అలా అయితే పార్టీ పెట్టేవాడినే కాదు అని పవన్ స్పష్టం చేశారు. నా జీవితం రాజకీయాలకే అంకితమన్నారు. నా శవాన్ని నలుగురు మోసుకెళ్లే వరకు నేను జనసేనను మోస్తానని స్పష్టం చేశారు.

ఇక వైసీపీ పాలన ఎలా ఉంటుందో చూద్దామని.. ప్రజలు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోదామని పవన్ అన్నారు. ఎక్కడ ఆకలి ఉంటే అక్కడ జనసేన గుర్తు కనబడాలని.. ప్రజలకు మనం ఉన్నామనే భరోసా ఇవ్వాలని అన్నారు.

ఓడిపోయినప్పుడే మన వారు ఎవరు? పగవారు ఎవరన్న విషయం తెలుస్తుందని.. ఈ పార్టీ అందరదని అందరిని కలిసి జనసేనను ముందుకు తీసుకెళ్తానని పవన్ చెప్పుకొచ్చారు.

ఈ ఎన్నికల్లో తనను ఓడించడానికి ప్రత్యర్తులు భారీ కుట్ర పన్నారని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భీమవరంలో అయితే ఏకంగా 150 కోట్లు ఖర్చు చేశారని.. అసెంబ్లీలో నన్ను అడుగుపెట్టకుండా ఇలా లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. తాను ఓటమిని అంగీకరించేవాడిని కాదని.. విజయం సాధించేవరకు పోరాడుతానని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -