- Advertisement -

జగన్ మార్క్..రెండోసారి సీఎం పక్కా!

- Advertisement -

ఏపీలో ఎన్నికలకు మరో మూడు నెలల సమయం ఉండగానే ప్రధాన పార్టీలన్ని అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ ఎన్నికల రేసులో ఒకడుగు ముందే ఉంది. వైనాట్ 175 టార్గెట్‌గా ముందుకు సాగుతున్న జగన్‌..రెండోసారి అధికారం కైవసం చేసుకోవడమే లక్ష్యంగాఓ స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.

బీసీలకు పెద్ద పీట, గెలుపే ప్రామాణికం ఈ రెండు అంశాలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు జగన్. చెప్పినట్లుగానే పలువురు సిట్టింగ్‌లకు సీటు నిరాకరణ మరికొంతమంది స్థాన చలనం ఇలా ప్రతి దాంట్లో తన మార్క్ చూపిస్తున్నారు. ఇక స్థాన చలనం కలిగిన వారింలో మంత్రులు కూడా ఉండటం విశేషం. ఇప్పటికే 11 నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జ్ లను ప్రకటించిన సీఎం జగన్..మరిన్ని స్థానాల్లో మార్పులకు సిద్దమయ్యారని ఇన్ సైడ్ టాక్.

మరికొంతమంది మంత్రుల స్థానాలను మార్చనున్నారని పార్టీ వర్గాలు చెబుతుండగా అదే సమయంలో సామాజిక న్యాయం – సంక్షేమం నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఎన్నికలకు రెండు నెలల ముందుగానే అభ్యర్థులను ఖరారు చేయడం ద్వారా అసంతృప్తులను బుజ్జగించవచ్చని జగన్ ప్లాన్‌. ఇక టికెట్ దక్కని వారికి నామినేటెడ్‌ పోస్టులు ఇస్తామని హామీ ఇస్తున్నారు జగన్. ఇక పలువురు ఎమ్మెల్యేలను ఎంపీలుగా, కొంతమంది ఎంపీలను ఎమ్మెల్యేలుగా, సీనియర్ నేతల వారసులు ఇలా ప్రతి ఒక్క అంశంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు జగన్. దీంతో వైసీపీ అధినేత ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియక విపక్షాల మైండ్ బ్లాంక్ అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -