Monday, April 29, 2024
- Advertisement -

సీనియర్ హీరో ని ముద్దాడనున్న కాజల్ అగర్వాల్

- Advertisement -

ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోలలో లిప్ లాక్ సీన్లలో సైతం నటిస్తున్న వారిలో కమల్ హాసన్ కూడా ఒకరు. ఒకప్పుడు ప్రతి సినిమాలో లిప్ లాక్ సీన్ లో నటించిన కమల్ హాసన్ ఈ మధ్య కూడా ఆండ్రియా జెరేమియా, పూజా కుమార్, మరియు మధుశాలిని వంటి నటీమణులతో లిప్ లాక్ సన్నివేశాలు చేశారు. ప్రస్తుతం కమల్హాసన్ శంకర్ దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ మూవీ ‘భారతీయుడు’ కి సీక్వెల్ అయిన ‘భారతీయుడు 2’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే ఇన్నేళ్ల కెరీర్లో కాజల్ అగర్వాల్ తెరపైన రెండో మూడో సినిమాలలో తప్పితే ఎక్కువగా లిప్ లాక్ సన్నివేశాల్లో నటించలేదు. మరి ఈమె ‘భారతీయుడు 2’ సినిమాలో కమల్ హాసన్ ని ముద్దాడనుందా అని సందేహాలు రేకెత్తుతున్నాయి. కాజల్ మరియు కమల్ హాసన్ కి మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు సినిమాలు ఉన్నాయని సన్నిహిత వర్గాలు కూడా సమాచారం అందిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే సెట్స్ పైకి వెళ్ళింది. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -