Tuesday, April 30, 2024
- Advertisement -

ఆ ముద్దులో త‌ప్పులేద‌ట‌..!

- Advertisement -

స్టార్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను ఇటీవ‌లే ఓ సినిమా ఫంక్ష‌న‌ల్‌లో సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు ముద్దు పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే.అప్పుడు ఈ ముద్దు విష‌యం పెద్ద సంచ‌ల‌నంగా మారింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే…కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా బెల్ల‌కొండ శ్రీనివాస్ హీరోగా క‌వ‌చం అనే సినిమా తెర‌కెక్కుతుంది.ఈ సినిమా టీజ‌ర్ ఈవెంట్‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా కాజ‌ల్ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడుపై ప్ర‌శంస‌లు వ‌ర్షం కురిపించింది.దీంతో ఆమె మాట్లాడుతుండ‌గానే చోటా కాజ‌ల్‌కు ముద్దు పెట్టాడు.ఇది కాజ‌ల్ కూడా ఊహించ‌లేదు.త‌రువాత వెంట‌నే తెరుకున్న కాజ‌ల్ ..చోటా కూడా మా ఫ్యామిలీలో ఒక‌రు అంటూ ఈ వివాదాన్ని పెద్ద‌ది కాకుంగా బాగానే క‌వ‌ర్ చేసింది.అయితే ఈ విష‌యంలో మాత్రం కాజ‌ల్ ఫ్యాన్స్ చోటాని ఓ రేంజ్‌లో వేసుకున్నారు.

స్టేజ్ మీద ఒక మహిళతో ప్రవర్తించే తీరు ఇదేనా అంటూ ఛోటాని టార్గెట్ చేశారు. దీనికి ఛోటా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా అతడి మీద విమర్శలు చేయడం ఆపలేదు. ఇంత వ్యవహారం జరుగుతున్నా.. కాజల్ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు.ఇప్పుడు దీని మీద చర్చలు జోరుగా సాగడంతో ఆమె తనకు తెలిసిన వాళ్ల దగ్గర ఈ విషయంపై మాట్లడిందట. ”నా కెరీర్ మొదలైనప్పటి నుండి ఆయన ఎంతగానో ప్రోత్సహించారు. ఇంకా చెప్పాలంటే నాకు గాడ్ ఫాదర్ వంటి వారు. అందుకే ఆ వేదికపై ఆయన చేసింది నాకేం తప్పుగా అనిపించలేదని” తనను ఆ ముద్దు గురించి అడుగుతున్న వారికి తెలిపింది కాజ‌ల్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -