Monday, May 6, 2024
- Advertisement -

కాజల్ టాటా చెప్పేసింది

- Advertisement -

‘బ్రహ్మోత్సవం’ సినిమా టీమ్ కి కాజల్ టాటా చెప్పేసింది. ఈ షెడ్యూల్లో తనకి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తికావడంతో, ఆమె అందరికీ బై చెప్పేసి వెళ్లిపోయింది. ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా ఊటీలో జరుగుతోంది. మహేశ్ బాబుతో పాటు కాజల్ .. ప్రణీత .. సత్యరాజ్ .. రేవతి .. తులసి తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.

ఈ షెడ్యూల్లో కాజల్ కి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. మహేశ్ తో మళ్లీ నటించే అవకాశం కలిగినందుకు కాజల్ చాలా ఆనందాన్ని వ్యక్తం చేసింది. అంతే కాకుండా ఒక చక్కని టీమ్ తో కలిసి పనిచేసిన ఫీలింగ్ కలిగిందని చెప్పింది. ఒక పిక్ నిక్ ను పూర్తిచేసుకుని వెళుతున్నట్టుగా ఉందని అంటూ ఊటీ నుంచి తిరుగు ప్రయాణమైందని చెబుతున్నారు.

ఈ సినిమాతో మహేశ్ బాబు .. కాజల్, శ్రీకాంత్ అడ్డాల .. మహేశ్ బాబు హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. అంతేకాదు .. ‘శ్రీమంతుడు’ హిట్ తరువాత మహేశ్ చేస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -