Saturday, May 18, 2024
- Advertisement -

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కాజల్ మేనేజర్

- Advertisement -

సిట్ అధికారులు.. టాలీవుడ్ ప్రముఖులను విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విచారణలో తీగ లాగితే డొంక కదిలినట్లు.. కొత్త కొత్త విషయాలు బయటపడుత్నున్నాయి. ఇప్పటికే పూరీ జగన్నాథ్, శ్యాం కె నాయుడు, తరుణ్, సుబ్బరాజులను పోలీసులు విచారించారు. తాకా నవదీప్ ను విచారిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మేనేజర్ రోనిని.. ఇప్పుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయడం.. పెద్ద హాట్ టాపిక్ అయింది.

ఇప్పటికే ఈ డ్రగ్ కేసులో టాలీవుడ్ సెలబ్రిటీలు ఉన్నారని.. వారి పేర్లు ఒక్కటికి కూడా బయటకు రావడం లేదని.. ఇండస్ట్రీలో పడా నిర్మాత ఫ్యామిలీకి కూడా ఈ డ్రగ్స్ దందాతో సంబంధాలు ఉన్నాయని.. రూమర్లు తెగ హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా కాజల్ అగర్వాల్ మేనేజర్ రోనిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాజల్ కి గత కొంతకాలంగా మేనేజర్ గా వ్యవహరిస్తున్న అతను.. డ్రగ్స్ సేవిస్తున్నాడనే అనుమానంతో పోలీసులు నిఘా పెట్టారు. రీసెంట్ గా అతడి ఇంట్లో సోదాలు చేయగా.. డ్రగ్స్‌కి బదులుగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే చాలా కాలంగా రోనీ డ్రగ్స్ వాడుతున్నాడని సమాచారం అందుతోంది.

ఈ రోనిని కేవలం కాజల్ కి మాత్రమే కాకుండా.. గతంలో లావణ్య త్రిపాఠి, రాశిఖన్నాలకు కూడా మేనేజర్‌గా పని చేసినట్లు తెలుస్తోంది. అయితే రోని డ్రగ్స్ తీసుకున్నాడా.. లేదా అనే విషయం వైద్య పరీక్షల ద్వారా తెలుసుకోనున్నారు పోలీసులు. ఒక వేళ అతడు రోని డ్రగ్స్ తీసుకుంటున్నాడని తేలితే అతడికి డ్రగ్స్ ఎక్కడనుంచి వచ్చాయి. రోనీ ఎవరెవరికి డ్రగ్స్ అందించే వాడు లాంటి.. ప్రధాన విషయాలు బయటకు వచ్చే చాన్సు ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -