Thursday, May 16, 2024
- Advertisement -

అనసూయ కోసం చరణ్ అయిన సరే వేచి చూడాల్సిందేనా..?

- Advertisement -

అనసూయ.. జబర్ధస్త్ షోతో ఎలాంటి క్రేజ్ తెచ్చుకుందో అందరికి తెలిసిందే. తన అందాలతో యాంకరింగ్ కే కొత్త కలరింగ్ తెచ్చిపెట్టింది ఈ ముద్దుగుమ్మ. కేవలం బుల్లితెరపైనే కాకుండా వెండి తెరపై కూడా మెరుస్తోంది. అయితే బుల్లితెర పై చాలా బిజీగా ఉన్న ఈ భామకు వెండితెరపై పిలిచి మరి అవకాశాలు ఇస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయన, క్షణం, విన్నర్ లో నటించింది. అయితే ఇప్పుడు మరో సూపర్ సినిమాలో చాన్స్ పట్టేసింది అనసూయ.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వస్తున్న మూవీ రంగస్థలం 1985. ఈ సినిమాలో అనసూయ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. అంతేకాదు. ఆమె ఉండేది తక్కువ టైం అయినప్పటికి.. అది సినిమాకే హైలేట్ అంటున్నారు. అయితే అనసూయ ఈ సినిమా ఒప్పుకున్న ఇప్పుడు ఆమె షూటింగ్ కి హాజర్ కాలేకపోతుందట. వేరే ప్రోగ్రామ్స్ కి డేట్స్ ఇవ్వడంతో.. రామ్ చరణ్ సినిమాకి డేట్స్ కుదరడం లేదట.

అనసూయ కోసం ఆ పాత్ర క్రియేట్ చేయడంతో.. డైరెక్టర్ సూకుమర్, హీరో చరణ్ కొన్ని రోజులు షూటింగ్ వాయిదా వేయాలని ఆలోచిస్తున్నారట. అనసూయ తో షూటింగ్ కంప్లీట్ అయ్యాక మిగితా సీన్స్ తెరకెక్కించనున్నారట. ఇక ఇదే కాక మంచు విష్ణుతో మదన్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కూడా అనసూయ ఓ ముఖ్య పాత్ర చేయబోతుందట. మొత్తానికి ఇటూ.. షోస్ తో.. అటూ సినిమాలతో అనసూయ ఫుల్ బిజీగా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -