Sunday, May 5, 2024
- Advertisement -

శ్రీజ‌ని పెళ్లి చేసుకోవ‌డం వ‌ల్లే హీరోగా చాన్స్‌

- Advertisement -

క‌ల్యాణ్ దేవ్ ఈ పేరు పెద్ద‌గా తెలుగు ఇండ‌స్ట్రీలో ఎవ‌రికి తెలిక‌పోవ‌చ్చు.కాని మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ల్యాణ్ దేవ్ అంటే మాత్రం అంద‌రికి ఠ‌క్కున గుర్తుకు వ‌స్తాడు.ఇప్పుడు ఇత‌ను గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఏం లేదండీ క‌ల్యాణ్ దేవ్ హీరోగా ఇండ‌స్ట్రీకి ప‌రిచియ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసింది.విజేత సినిమాతో చిరంజీవి అల్లుడు క‌ల్యాణ్ దేవ్ తెలుగు తెర‌కు ప‌రిచియ‌మ‌వుతున్నాడు.ఇప్ప‌టికే మెగా ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలు ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు,వ‌స్తున్నారు.ఇంకా చెప్పాలంటే తెలుగు ఇండ‌స్ట్రీలో మెగా ఫ్యామిలీ నుండే ఎక్కువ మంది హీరోలు ఉన్నారు అంటే అర్థం చేసుకోవాలి వారి ప్ర‌భావం ఎంత‌లా ఉందో.అయితే మెగా ఫ్యామిలీ నుండి ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన హీరోల‌ది ఓ లెక్క క‌ల్యాణ్ దేవ్‌ది మ‌రో లెక్క‌.ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన హీరోలంద‌రు చిరంజీవి తమ్ముడి కొడుకులు,బావ‌మ‌రిది కొడుకులు,చెల్లెలు కొడుకులు మాత్ర‌మే వ‌చ్చారు.

అంటే ర‌క్త సంబంధీకులు మాత్ర‌మే వ‌చ్చారు.ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి ఫ్యామిలీ నుండి బ‌య‌టి వ్య‌క్తి ఇండ‌స్ట్రీకి ప‌రిచియ‌మవుతున్నారు. చిరంజీవి కూతురు శ్రీజని పెళ్లి చేసుకోవ‌డం వ‌ల్ల‌నే క‌ల్యాణ్ దేవ్ హీరోగా ప‌రిచియ‌మవగలుగుతున్నాడు.లేదంటే అత‌నిని హీరోగా పెట్టి ఎవ‌రు సినిమా చేస్తార‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి.అస‌లు క‌ల్యాణ్ దేవ్ హీరో కావ‌డానికే శ్రీజని పెళ్లి చేసుకున్నాడ‌ని కొంద‌రి వాద‌న‌.అత‌ను ఫేస్ కూడా హీరోగా సూట్ అవ్వ‌ద‌ని ఇండ‌స్ట్రీలోని కొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు.మ‌రి ఇన్ని వ్య‌తిరేక‌త‌ల మ‌ధ్య క‌ల్యాణ్ దేవ్ విజేత సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.ఒక‌వేళ ఈ సినిమా ఫెయిల్ అయిన మ‌రో అవ‌కాశం అత‌నికి త‌ప్ప‌కుండా వ‌స్తుంది.ఎందుకంటే క‌ల్యాణ్ దేవ్ వెన‌క ఎలాగు మెగాస్టార్ చిరంజీవి ఉంటాడు కాబ‌ట్టి అత‌ని కెరీర్‌కు ఎటువంటి డోకాలేదు.రెండు,మూడు సినిమాలు చేస్తే జ‌నాల‌కు అలవాటు ప‌డ‌తాడ‌ని మెగా ఫ్యామిలీ భావిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -