Thursday, April 25, 2024
- Advertisement -

బ‌యెపిక్ కోసం ఎవ‌రూ సంప్రదించలేదు – క‌ల్యాణ్ రామ్

- Advertisement -

నందమూరి తారక రామారావు జీవిత కథను బ‌యెపిక్ రూపంలో సినిమాగా తీసుకురావ‌ల‌ని ఆయ‌న త‌న‌యుడు హీరో నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే.ముందుగా ఈ బయోపిక్‌ను తేజ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ప్రాజెక్ట్‌నుంచి తప్పుకోవటం క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్టు గా ప్రకటించారు. ఈ సినిమాలో నంద‌మూరి వంశం వారు చాలామంది న‌టిస్తున్నారు.

ఈ సినిమాలో హరికృష్ణ పాత్రలో నందమూరి కల్యాణ్ రామ్ క‌నిపిస్తాడ‌ని ఎప్ప‌టి నుండో వార్త‌లు వ‌స్తున్నాయి.ఈ విష‌యంపై కల్యాణ్ రామ్‌ క్లారిటీ ఇచ్చారు.నా నువ్వే సినిమా ప్రమోషన్‌ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కల్యాణ్‌ రామ్‌.. ఎన్టీఆర్‌ బయోపిక్‌ విషయమై తనను ఎవరూ సంప్రదించలేదని తెలిపారు. దీంతో ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో క‌ల్యాణ్ రామ్ నటిస్తున్నాడంటూ వస్తున్న వార్తలకు తెరపడింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -