- Advertisement -

బాబుకు సూపర్ షాక్….. జగన్‌కి బాబు తప్పులు చెప్పి బుక్ చేస్తోంది సిఎం రమేష్‌?

- Advertisement -

వచ్చే ఎన్నికల్లో పులివెందులలో కూడా గెలుస్తాం అని చంద్రబాబు తరచుగా చెప్తూ ఉంటాడు. ఆ వెంటనే వచ్చే ఎన్నికల్లో పులివెందులలో కూడా జగన్‌కి కష్టాలే అనే రేంజ్‌లో రాధాకృష్ణ వార్తా కథలు వండి వారుస్తూ ఉంటాడు. అలా టిడిపి కేడర్‌ని సంతృప్తి పరుస్తూ, వాళ్ళు కూడా సంతృప్తి పడుతూ ఉంటారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం పూర్తి రివర్స్‌లో ఉంటాయి. 2019 ఎన్నికల్లో మొత్తం కడప జిల్లాలో టిడిపికి ఒక్క ఎమ్మెల్యే సీటు, ఎంపి సీటు కూడా దక్కదని ఇప్పటికే సర్వేలు తేల్చేశాయి. అయినప్పటికీ మేకపోతు గాంభీర్యం మాత్రం చూపిస్తుంటారు బాబు అండ్ కో.

అయితే ఇప్పుడు బాబుతో సహా టిడిపి శ్రేణులందరికీ దిమ్మతిరిగే షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. కొన్నేళ్ళుగా ఏ నాయకుడిని చూపించి కడపలో జగన్‌ని దెబ్బకొడతాం అని ప్రచారం చేస్తున్నారో ఆ నాయకుడు సిఎం రమేష్‌నే వైఎస్ జగన్‌కి తొత్తు అనే రేంజ్‌లో స్వయానా టిడిపి ముఖ్య నాయకులే ఆరోపణలు చేస్తున్నారు. విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు టిడిపి నాయకుల మధ్య ఈ వార్తలే హాట్ టాపిక్ అయ్యాయి. ఆల్రెడీ ఒక ఫిరాయింపు ఎమ్మెల్యేను, టిడిపి స్థానిక నేతను కూర్చోబెట్టి ఐఎఎస్‌ల సమక్షంలో అవినీతి పంపకాలు ఎలా చేసుకోవాలో చంద్రబాబు చెప్పిన వైనం రాష్ట్ర ప్రజలందరికీ షాకిచ్చింది. అలాంటి అక్రమ, అవినీతి వ్యవహారాలతోనే టిడిపి పూర్తిగా కునారిల్లిపోయిన పరిస్థితి. ఇప్పుడిక నేతల మధ్య విభేదాలు, ఎవ్వరినీ ఎవ్వరూ నమ్మకపోవడంలాంటి పరిస్థితులు ఎదురవ్వడంతో 2019ఎన్నికల్లో పరిస్థితి ఏంటా అని టిడిపి శ్రేణులే ఆందోళన చెందేలా పరిస్థితులు మారుతున్నాయి. టిడిపి నాయకులు కూడా చాలా మంది 2019లో టిడిపి గెలుపుపై అనుమానాలతో వైకాపావైపు చూస్తూ ఉండడం బాబులో ఆందోళన రేకెత్తిస్తోంది. పులివెందుల, కడపల విషయం పక్కనపెడితే రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ సారి టిడిపికి ఘోరపరాభవం తప్పదా అన్న విశ్లేషణలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తూ ఉండడం పరిస్థితికి అద్దం పడుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -