Friday, March 29, 2024
- Advertisement -

మెగా హీరో క‌థ‌తో నంద‌మూరి హీరో సినిమా

- Advertisement -

సినిమా ఇండ‌స్ట్రీలో ఒక‌రు చేయల్సిన సినిమా మ‌రోకరు చేసిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా మెగా హీరో చేయ‌ల్సిన సినిమాను నంద‌మూరి హీరో చేస్తున్నాడ‌ని తెలుస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే … ఇటీవ‌లే 118 సినిమాతో హిట్ కొట్టాడు క‌ల్యాణ్ రామ్. ఈ సినిమా హిట్ ఇచ్చిన జోష్‌లో వెంట‌నే త‌న త‌దుప‌రి సినిమాను మొదలుపెట్టాడు. వేణు అనే ఒక కొత్త దర్శకుడు చెప్పిన క‌థ న‌చ్చడంతో వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ట‌. అయితే మొద‌ట ఈ క‌థ మెగా హీరో ద‌గ్గ‌ర‌కు వెళ్లింద‌ట‌. అల్లు అర‌వింద్ కొడుకు అల్లు శిరీష్‌కు మొద‌ట ఈ క‌థ‌ను వినిపించాడ‌ట ఈ ద‌ర్శ‌కుడు.

అయితే క‌థ విన్న శిరీష్ త‌న‌కు సెట్ కాద‌ని చెప్ప‌డంతో , ఇదే క‌థ‌ను క‌ల్యాణ్ రామ్‌కు వినిపించాడ‌ట. కొత్త క‌థ కావ‌డంతో సినిమా చేద్ద‌మ‌ని మాటిచ్చాడ కల్యాణ్ రామ్‌. ఇక ఈ సినిమా తుగ్ల‌క్‌కు సంబంధించిన క‌థ అని ఇండ‌స్ట్రీ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఫాంటసీ చిత్రం కావడంతో బడ్జెట్ ఎక్కువ అవుతుందని మరో నిర్మాతను కలవకుండా సినిమాను సొంత ప్రొడక్షన్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లోనే నిర్మించేందుకు కళ్యాణ్ రామ్ సిద్దమవుతున్నాడు. మ‌రి ఈ సినిమా కూడా క‌ల్యాణ్ రామ్‌కు మ‌రో హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -