Friday, May 3, 2024
- Advertisement -

భారతీయుడు 2 నుంచి బయటకొచ్చిన ఛాయాగ్రాహకుడు

- Advertisement -

అదేంటో గాని సరైన ముహూర్తానికి భారతీయుడు 2 మొదలు కాలేదో ఏమో ఆది నుండి అనేక ఆటంకాల నడుమ ఈ సినిమా ప్రస్తుతం ముందుకు సాగుతుంది. అసలు ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందా లేదా, లేక సినిమా ని ఆపేశారా, అసలు సినిమా పరిస్థితి ఏంటి అని చాలా మంది అభిమానులు డైలమా లో కూడా పడ్డారు. అయితే ఈ నేపథ్యం లో ఈ సినిమా మీద ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

అదేంటంటే, ఈ సినిమా లో ఛాయాగ్రాహకుడు గా ముందు గా అనుకున్న రవి వర్మన్ ఇప్పుడు సినిమా లో లేరు. ఆయన మొదట కొంత భాగం సినిమా ని షూట్ చేశారు కూడా. కానీ ఇప్పుడు ఆయన సినిమా నుంచి వైదొలిగారట. తమిళ సినిమా పరిశ్రమ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇప్పుడు ఈ సినిమా లో రత్నవేలు ఛాయాగ్రాహకుడు గా పని చేస్తున్నారు. రోబో సినిమా తర్వాత దర్శకుడు శంకర్ తో రత్నవేలు పనిచేస్తున్న సినిమా ఇదే. దాదాపు గా ఐదేళ్ల తర్వాత రత్నవేలు మళ్ళీ తమిళ సినిమా పరిశ్రమ కి వెళ్తున్నారు.

ప్రస్తుతం ఆయన తెలుగు లో మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవరు సినిమా ని షూట్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -