Saturday, May 18, 2024
- Advertisement -

స్టీఫెన్ రవీంద్రకు క్లియరెన్స్ ఇచ్చిన కేంద్ర హోంశాఖ

- Advertisement -

సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జగన్ కొత్త టీమ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే సమర్థ వంతులైన అధికారులను తన టీమ్ లో నియమించుకున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా స్టీఫెన్ రవీంద్రను నియమించుకోవాలని జగన్ భావించారు. దీంతో తెలంగాణా సీఎం కేసీఆర్ తో కూడా చర్చించారు. డిప్యూటేషన్ పై ఏపీకి స్టీఫెన్ రవీంద్రను పంపడానికి కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించారు. మరో వైపు ఇదే విషయమై ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్ కోసం కేంద్రానికి లేఖరాశారు.

అప్పటినుంచి కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. వైసీపీ ఎంపీలు మరో సారి తమ ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో కేంద్రం నుండి సానకూలంగా స్పందన లభించింది. డిప్యూటేషన్ పై ఆంద్రప్రదేశ్ లో పనిచేసేందుకు స్టీఫెన్ రవీంద్రకు లైన్ క్లియర్ అయ్యింది. ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్‌కు కేంద్ర హోంశాఖ అనుమతించింది. దీంతో రెండు మూడు రోజుల్లో స్టీఫెన్ రవీంద్ర ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్ లెటర్‌ను తెలంగాణా ప్రభుత్వానికి కేంద్రం పంపనుంది. ఆ తర్వాత స్టీఫెన్ ను ఆంధ్రప్రదేశ్ కు డిప్యుటేషన్ కింద తెలంగాణ ప్రభుత్వం పంపనుంది. ప్రస్తుతం రెండు నెలలుగా సెలవులో ఉన్నారు స్టీఫెన్ రవీంద్ర.

గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఛీప్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా స్టీఫెన్ రవీంద్ర పనిచేశారు. రాయలసీమలో కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 1990 బ్యాచ్‌కు చెందిన రవీంద్ర… సర్దార్ వల్లభాయ్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. దీంతో స్టీఫెన్ రవీంద్రను జగన్ ఇంటలిజెన్స్ విభాగానికి చీఫ్ చేయాలని భావించారు. మరో వైపు శ్రీలక్ష్మి కూడా ఏపీలో పనిచేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే సీఎం జగన్ ను కూడా కలసి తన అభిప్రాయాన్ని తెలిపారు. దీంతో జగన్ కూడా సానుకూలంగా స్పందించారు. దీనిలో భాగంగానె కొద్ది రోజుల క్రితం కేంద్ర హోమంత్రి అమీత్ షాను కూడా కలిశారు. కేడర్ మార్పు విషయమై ఆమె అమిత్ షా తో చర్చించారు. శ్రీలక్ష్మికి కూడ కేడర్ మార్పు విషయంలో సానుకూలమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -