Wednesday, May 15, 2024
- Advertisement -

బాహుబ‌లిని బ్రేక్ చేసిన విశ్వ‌రూపం – 2

- Advertisement -

లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్‌ న‌టించిన విశ్వ‌రూపం 2 నిన్న‌(గురువారం) విడుద‌లైంది.విశ్వరూపం సినిమా టైంలోనే ఈ సినిమాకు సీక్వెల్‌ వస్తుందని ఎప్పుడో ప్రకటించాడు క‌మ‌ల్‌.అయితే వివిధ కార‌ణాల‌తో సినిమా వాయిదా ప‌డుతు వ‌చ్చింది.దీంతో ఈ సీక్వెల్‌పై అంద‌రికి ఆస‌క్తి త‌గ్గిపోయింది.అన్ని అడ్డంకులు దాటుకుని ఈ సినిమా విడుదలైంది. ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 10న విడుదలైన విశ్వరూపం2 డివైడ్‌ టాక్‌ను తెచ్చుకుంది.

మొదటి పార్ట్‌ మెప్పించినంతగా విశ్వరూపం2 మెప్పించలేకపోయిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయినా చెన్నైలో మాత్రం మొదటి రోజు ఓపెనింగ్స్‌ అదిరిపోయాయి. అంతేకాకుండా చెన్నైలో బాహుబలి2 ఫస్ట్‌ డే రికార్డును బద్దలు కొట్టింది. చెన్నై నగరంలో మొదటి రోజు ఈ చిత్రం దాదాపు 93 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. విశ్వ‌రూపం 2 లో ఆండ్రియా,పూజా రాజ‌కుమార్ హీరోయిన్లుగా న‌టించారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -